Home

»

Latest News

జగపతిబాబు చేతిలో కీర్తి సురేష్ లక్!

Jan 24, 2022 12:07PM

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత మిస్ ఇండియా, రంగ్ దే వంటి సినిమాలతో పలకరించినప్పటికీ ఆశించినస్థాయిలో మెప్పించలేకపోయింది. కీర్తి సురేష్  ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనుంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని సోమవారం విడుద‌ల చేసింది చిత్ర యూనిట్.

మన దేశం గర్వపడేలా షూటర్స్ ని తయారు చేయబోతున్నాను అంటూ జ‌గ‌పతిబాబు చెప్పే డైలాగ్ తో ట్రైల‌ర్‌ ప్రారంభమవుతుంది. 'మన మధ్యలోనే ఒక గొప్ప షూటర్ ఉంది సార్ ' అని ఆది చెప్పగా.. బ్యాడ్‌ ల‌క్ స‌ఖి గా కీర్తి సురేష్ ప‌రిచ‌యం అవుతుంది. గ్రామస్తులు అంతా దురదృష్టవంతురాలుగా చూసే సఖి.. జగపతిబాబు సపోర్ట్ తో బ్యాడ్‌ ల‌క్ స‌ఖి కాస్తా గుడ్ లక్ సఖిగా ఎలా మారిందనేది ఈ సినిమా కథ అని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. ఆద్యంతం ఆస్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
 
ప్ర‌ముఖ నిర్మాత  దిల్‌రాజు  సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్న ఈ సినిమాకి నగేష్ కుకునూర్ ద‌ర్శ‌కుడు. తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిన ఈ మూవీ జ‌న‌వ‌రి 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ కానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com