రజినీ, చిరుని ముంచేసిన కీర్తి సిస్టర్ సెంటిమెంట్!
on Aug 12, 2023

'మహానటి'తో ఎంతోమందికి అభిమాన నటిగా మారింది కీర్తి సురేశ్. కేవలం ప్రేక్షకులకే కాదు సినీ ప్రముఖులకి సైతం ఆమె అభినయం భలేగా నచ్చేసింది. అందుకే.. ఏరికోరి కీర్తిని తమ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారు అగ్ర కథానాయకులు. ఇందులో భాగంగానే అటు సూపర్ స్టార్ రజినీకాంత్, ఇటు మెగాస్టార్ చిరంజీవి ఏకకాలంలో కీర్తిని 'సిల్వర్ స్క్రీన్ సిస్టర్'గా సెలెక్ట్ చేసుకున్నారు.
తమిళ చిత్రం 'అణ్ణాత్తే' (తెలుగులో 'పెద్దన్న')లో రజినీకాంత్ కి చెల్లెలుగా కనిపించిన కీర్తి సురేశ్.. తెలుగు చిత్రం 'భోళా శంకర్'లో చిరంజీవికి చెల్లిగా దర్శనమిచ్చింది. 2021 నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదలైన 'అణ్ణాత్తే' తీవ్ర నిరాశపరచగా.. 2023 ఆగస్టు 11న జనం ముందు నిలిచిన 'భోళా శంకర్' కూడా ప్రస్తుతం అదే బాటలో పయనిస్తోంది. మొత్తమ్మీద.. అటు రజినీ, ఇటు చిరుకి కీర్తితో చేసిన సిస్టర్ సెంటిమెంట్ బాక్సాఫీస్ రిజల్ట్ పరంగా ముంచేసిందనే చెప్పొచ్చు. ఏదేమైనా.. కీర్తికి సిస్టర్ రోల్స్ వర్కవుట్ కావడం లేదన్నది స్ఫష్టం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



