Home

»

Latest News

'ప్యారడైజ్'లో సుబ్బు: ఫస్ట్ ఛాయిస్ జాన్వీ కపూర్.. చేసుంటే మామూలు రచ్చ కాదు.!

Sep 26, 2026 4:46PM

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన 'ది ప్యారడైజ్' మూవీ థియేటర్లలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'సుబ్బు' అనే బోల్డ్ అండ్ వింటేజ్ గర్ల్ క్యారెక్టర్‌లో కయాదు లోహర్ నటించింది. అయితే, ఈ రోల్ వెనుక ఒక ఆసక్తికరమైన కాస్టింగ్ సీక్రెట్ ఉంది.

సుబ్బు క్యారెక్టర్ కోసం కయాదు లోహర్ ఫస్ట్ ఛాయిస్ కాదట. అసలు దర్శకనిర్మాతలు ఈ పాత్ర కోసం ముందుగా అనుకున్నది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని. జాన్వీ అయితే పాన్-ఇండియా మార్కెట్‌కి బాగా ప్లస్ అవుతుందని మేకర్స్ భావించారట.

'దేవర' సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్, సౌత్‌లో వరుస ఆఫర్లు అందుకుంటోంది. శ్రీకాంత్ కూడా జాన్వీని కలిసి కథ వినిపించారట. కానీ, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. 

ఈ క్రమంలోనే 'మొగిల్‌పేట', 'డ్రాగన్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ కయాదు లోహర్‌ని చిత్రయూనిట్ ఎంపిక చేసింది. అయితే ఈ సినిమాలో సుబ్బు పాత్ర బోల్డ్ గానే ఉంటుంది. కుటుంబ పరిస్థితుల వల్ల బిగ్రేడ్ సినిమాల్లో నటిస్తుంది. అందుకే కయాదు లోహర్‌ పోషించిన ఈ పాత్రపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పొరపాటున 'ప్యారడైజ్'లో సబ్బు క్యారెక్టర్ జాన్వీ చేసుంటే రచ్చ మామూలుగా ఉండేది కాదేమో. 'పెద్ది'లో గ్లామర్ డోస్ పెరిగినందుకే ట్రోల్స్ వచ్చాయి. అలాంటిది సుబ్బు రోల్ లో కనిపించి ఉంటే.. ఇంకే రేంజ్ లో ఉండేదో అనే చర్చ జరుగుతోంది. 

ఇది కూడా చదవండి: కీర్తి సురేష్ మూవీపై వివాదం.. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ సెగ‌.!

 

 

 

[Janhvi Kapoor First Choice For Subbu Role, Janhvi Kapoor Missed Subbu Role, Janhvi Kapoor Missed Paradise, The Paradise Movie, Nani Paradise, Kayadu Lohar, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com