'సర్కారు వారి పాట'లో కీర్తి క్యారెక్టర్ అదేనా?
on Jul 26, 2020

ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలవడంతో మహేశ్ చాలా హ్యాపీగా లాక్‌డౌన్ రోజుల్ని గడుపుతూ వస్తున్నాడు. దాని తర్వాత 'సర్కారు వారి పాట' సినిమా చేయడానికి అతను సిద్ధమవుతున్నాడు. 'గీత గోవిందం' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత డైరెక్టర్ పరశురామ్ రూపొందించబోతున్న మూవీ ఇదే. ఇందులో మహేశ్ జోడీగా జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్ ఎంపికైంది. బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఆ కుంభకోణానికి కేంద్రంగా ఉండే బ్యాంక్ ఎంప్లాయ్‌గా కీర్తి క్యారెక్టర్ కనిపిస్తుందట.
మే 31న సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన మహేశ్ ప్రి లుక్ పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకున్నారు. చెవికి రింగ్, మెడపై వన్ రూపీ కాయిన్ టాట్టూ, పెంచిన జుట్టుతో మహేశ్ మాస్ లుక్‌లో కనిపించనున్నడని ఆ ప్రి లుక్ తెలియజేసింది. ఇప్పుడు బ్యాంక్ కుంభకోణం బ్యాక్‌డ్రాప్‌తో సినిమా ఉంటుందనే ప్రచారంతో అందరిలోనూ ఆసక్తి రేకెత్తుతోంది. కమర్షియల్ అంశాలు మేళవించిన మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో మొదలవ్వవచ్చని అంచనా. మరోవైపు కీర్తి నటించిన 'మిస్ ఇండియా' విడుదలకు రెడీ అవుతుండగా, 'గుడ్‌లక్ సఖి' షూటింగ్ చివరి దశలో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



