Home

»

Latest News

Dhurandhar 2: హంజాతో అలజడులు సృష్టించాలనుకుంటున్నారా! వార్నింగ్ ఇస్తున్న ఆదిత్య ధర్   

Mar 26, 2026


-ఎందుకు ధురంధర్ 2 పై ద్వేషం 
-ఎవరు అలా చేస్తుంది
-ఆదిత్య ధర్ వార్నింగ్ ఇచ్చే దాకా పరిస్థితి వచ్చిందా!


ఇప్పుడు ఏ ఇద్దరు,ముగ్గురు కలిసినా ధురంధర్ 2(Dhurandhar 2)చూసావా లేదా అని ఒకరినొకరు అడిగే పరిస్థితి. చూడలేదంటే ఎక్కడ నామూషీగా ఉంటుందేమో అని వీలు చూసుకొని మరుసటి రోజు ఖచ్చితంగా చూస్తున్నారు. అందుకే రికార్డు కలెక్షన్స్ ధురంధర్  పాదాక్రాంతమవుతున్నాయి. ఇందుకు సాక్ష్యం ఫస్ట్ వీక్ కే సాధించిన 1000 కోట్ల రూపాయల గ్రాస్. ఈ విధంగా కనివిని ఎరుగని రికార్డులని సృష్టించే దిశగా ధురంధర్  బిజీగా ఉంటే కొంత మంది ధురంధర్ 2 ని బాడ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్లందరికీ ఆదిత్య ధర్(Aditya Dhar)తనదైన స్టయిల్లో వార్నింగ్ ఇస్తున్నాడు. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఉరఫ్ ఏఐ ని ఉపయోగించి కొంత మంది రణవీర్ సింగ్ క్యారక్టర్ హంజా తలకి సిక్కుల మాదిరిగా తలపాగా ధరించింపచేసి సిగరెట్ తాగుతునట్టుగా ఉంచి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో కొంత మంది సిక్కు సోదరులు హర్ట్  అవుతు కామెంట్స్ చేస్తున్నారు. విషయాన్నీ గమనించిన ఆదిత్య దర్ ఎక్స్ వేదికగా స్పందిస్తు హంజా తలపాగా ధరించిన పిక్ అబద్ధం. ఏఐ తో ఎవరో కావాలని క్రియేట్ చేసారు.అలజడులు సృష్టించాలనేది వాళ్ళ ప్లాన్. సిక్కుల పట్ల నాకెంతో గౌరవం ఉంది. వారిపై గౌరవంతోనే మూవీలో క్యారెక్టర్స్ ని డిజైన్ చేశాను. మళ్ళీ ఇలాంటి చర్యలకి పాల్పడితే కఠినమైన చర్యలని తీసుకుంటానని తన పోస్ట్ లో తెలిపాడు.


Also read: Anil Ravipudi: జరుగుతుందా! అదే జరిగితే సినీ అదృష్టం పట్టినట్లే 

ఆదిత్య ధర్ చెప్పినట్టుగానే సిక్కులపై గౌరవంతోనే సినిమా ప్రారంభంలో హంజా ఒరిజినల్ క్యారక్టర్ జస్కి రాత్ సింగ్ తుపాకీ చేతబూని కొంతమందిని అత్యంత జుగుప్సాకరంగా చంపుతాడు ఆ సమయంలో  జస్కి రాత్ చేత సిక్కు అనే సింబాలిక్ గా తలపాగా ధరింపచేయలేదు.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com