ENGLISH | TELUGU  

కత్తి మహేశ్ కు మన హీరోలు ఎలా వార్నింగ్ ఇచ్చారో చూడండి...!

on Sep 1, 2017

 

పవన్ కళ్యాణ్ పైనా.. మెగా ఫ్యామిలీ పైన మువీ క్రిటిక్ కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ పై కత్తి చేసిన కామెంట్లపై పవన్ అభిమానులు తుఫానులా ఆయనపై విరుచుకుపడ్డారు. ఒక్క పవన్ అభిమానులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో ఉన్న పలువురు హీరోలు కూడా కత్తి కామెంట్స్ పై స్పందించి ఆయనకు గట్టి వార్నింగే ఇచ్చారు. ఇప్పుడు ఎవరెవరు.. ఎలా వార్నింగ్ ఇచ్చారో చూద్దాం..

నాగబాబు..

పవన్ సోదరుడు నాగబాబు కత్తి మహేశ్ విమర్శలపై స్పందించి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. కత్తి మహేశ్  ఈ పేరు ఈ మధ్యనే విన్నాను. అంతాల ఫేమస్ అవ్వాలంటే.. మంచి సినిమాలు చేసి ఫేమస్ అవ్వాలి. అంతేకానీ.. ఇలాంటి విమర్శలు చేస్తే మాత్రం.. చివరకు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందని మండిపడ్డాడు. ఇది వరకూ కూడా పవన్ పై చాలా మంది కామెంట్లు చేశారు. నేను వారికి ఎలా సమాధానం ఇచ్చానో కూడా అందరికీ తెలుసు. అది కాకుండా నీకు కళ్యాణ్ గురించి ఏం తెలుసని అలా విమర్శలు చేశావని ఫైర్ అయ్యారు. ఈ సమస్య ఇక్కడితో ఆగాలంటే ఆయనపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని మీడియా ముందు ఒప్పుకో అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట. అంతేకాదు మళ్లీ ఇలాంటివి రిపీట్ అయితే పవన్ కాదు..అతని అభిమానులకు ఎలా సమాధానం చెప్పాలో తెలుసని కూడా అన్నారట.

రాం చరణ్..

పవన్ కళ్యాణ్ పై కత్తి మహేశ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ కత్తిపై కత్తి గట్టారు. అతనిపై మండిపడుతున్నారు. దీనిలోభాగంగానే ఈ వ్యవహారాన్ని రాం చరణ్ దృష్టికి తీసుకెళ్లగా.. చరణ్ చాలా కూల్ గా కత్తికి కౌంటర్ ఇచ్చినట్టు తెలస్తోంది. బాబాయ్ ను తక్కువ చేసి మాట్లాడటం అంటే అది వారి విలువను దిగజార్చుకొని మాట్లాడటమేనని.. ఈ విషయంలో మనం ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన పనిలేదు.. బాబాయ్ చేసే పనిలో నిజాయితీని గుర్తించ లేకపోవడం అది అతని ఖర్మ అని కౌంటర్ ఇచ్చాడు.

బండ్లా గణేష్..

కత్తి మహేశ్ విమర్శలపై గణేష్ స్పందిస్తూ.. తమ్ముడు కత్తి మహేశ్ సూర్యుడు వైపు చూడకు.. ఆ సూర్య కిరణాలైన మాలాంటి వాళ్ల వల్ల మాడి మసైపోతావ్...  కిరణాలవల్ల నీతి, నిజాయితీ గురించి చెప్పించుకునే అవకాశం పవర్ స్టార్ కు రాదు.. లేదు అని మండిపడ్డాడు. సూర్యుడు గురించి.. ఆయన శక్తి గురించి ఆలోచించే అంత బుర్ర లేదులే అని అన్నాడు.

అల్లు అర్జున్

పవన్, కత్తి మహేశ్ ఇష్యూ పై అల్లు అర్జున్ స్పందించి.. కత్తి మహేశ్ కు సీరియస్ వార్నింగే ఇచ్చినట్టు తెలుస్తోంది. తన మేనేజర్ ఫోన్ నుండి వార్నింగ్ ఇస్తూ ఆడియో మెసేజ్ పంపించాడ. సినీ రంగంలో పైకి రావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి...కానీ ఇందుకు నువ్వు ఎంచుకున్న మార్గం సరైంది కాదు..పవన్ కళ్యాణ్ గొప్ప స్టార్ కాదని నువ్వు అనుకోవడంలో తప్పులేదు.. దానితో విబేధించే హక్కూ నాకు లేదు... కానీ ఆ అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తపరచడం.. అది కూడా ఆ స్టార్ హీరో అభిమానులు హర్ట్ అయ్యేలా కామెంట్ చేయడం మాత్రం తప్పు అని క్లాస్ తీసుకున్నాడట. నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే.. అందుకే దీనిపై రియాక్ట్ కావాల్సి వస్తుంది.. ఇక ముందు ప్రచారం కోసం మా ఫ్యామిలీ హీరోల జోలికి కానీ.. ఇండస్ట్రీలో ఇతర హీరోల జోలికి రావద్దు.. అని వార్నింగ్ ఇచ్చాడట.

జూ. ఎన్టీఆర్

ఇక పవన్ పై కత్తి మహేశ్ చేసిన కామెంట్లపై తారక్ కూడా స్పందించినట్టు తెలుస్తోంది. కత్తి మహేశ్ కు ఫోన్ చేసిన తారక్... ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడితేనే బావుంటుందని... అసలు ఇలా ఎందుకు చేస్తున్నావని.. దీనివల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు.. ప్యూచర్ లో దీనివల్ల చాలా నష్టపోతావు అని చెప్పారట. ఇక ఈ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెడితే మంచిది.. అసలు కొంతకాలం దీనిపై స్పందించకుండా ఉంటే మొత్తం సర్దుకుంటుందని చెప్పాడట.

అలీ

అలీకి పవన్ కు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కు అలీ అత్యంత సన్నిహితుడు. ఇక కత్తి మహేశ్ వ్యవహారం తెలుసుకున్న అలీ ఆయనకు ఫోన్ చేసి అసలు నీకు పవన్ కళ్యాణ్ గురించి ఏం తెలుసు.. ముందుగా పవన్ గురించి పూర్తిగా తెలుసుకో.. నీ లాంటి వాళ్లు చాలామందికి ఆయన దారి చూపించాడు అని క్లాస్ తీసుకున్నాడట. తనకూ, కత్తి మహేశ్ కు జాయింట్ గా తెలిసిన కొంత మంది పేర్లు, నంబర్లను పంపి వాళ్లతో మాట్లాడమని చెప్పాడట.  అంతేకాదు నీతో ఇలా ఎవరైనా మాట్లాడిస్తున్నారా..? అని గట్టిగానే ప్రశ్నించాడట. ఏదైనా మాట్లాడేముందు అన్నీ తెలుసుకొని మాట్లాడాలని.. నువ్వు పవన్ గురించి మాట్లాడిన మాటలు పవన్ పట్టించుకోవడం లేదు... కానీ అతని గురించి ఇండస్ట్రీలో ఆలోచించే వాళ్లే నీ గురించి మాట్లాడుకుంటున్నారని.. ఇలాంటివి మళ్లీ రిపీట్ చేయోద్దని సలహా ఇచ్చారట.

నితిన్..

నితిన్ కు పవన్ అంటే ఎంత పిచ్చో మనకు తెలుసు. అలాంటిది కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలను చూస్తూ ఊరుకుంటాడా.. ఏకంగా కత్తి మహేశ్ కు ఫోన్ చేసి గట్టి వార్నింగ్ ఇచ్చాడట. పవన్ గురించి మాట్లాడే ప్రతి ఒక్క మాట నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు.. కానీ ఫ్యూచర్ లో చాలా ప్రభావం ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడట.

ఫథ్వీ..

కత్తి కామెంట్స్ పై స్పందించిన స్టార్ హీరోస్ గురించి మాట్లాడేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని.. పవన్ కళ్యాణ్ గురించి ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించారు. గొప్ప వారిని విమర్శించే ముందు మన స్థాయి ఏంటని ఆలోచించుకోవాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు రాయడం.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడటం సరికాదని అన్నారు. సినిమా గురించి మాట్లాడటం తప్పు.. కాని వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా తప్పు..పరిధులు దాటి మాట్లాడితే వారి ఫ్యాన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

మొత్తానికి పవన్ విషయంలో ఓవర్ గా మాట్లాడిన కత్తి మహేశ్ కు ఇండస్ట్రీలోని పవన్ సన్నిహితులు బాగానే క్లాస్ తీసుకుంటున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.