కాటమరాయుడు మీదకు "లాగే"స్తోంది..!
on Mar 9, 2017
డాలీ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. అయితే ఆడియో వేడుక మాత్రం నిర్వహించబోమని నిర్మాతలు మందే ప్రకటించారు. కాని సినిమాలోని ఆరు పాటలను రోజుకొక్క పాట చొప్పున రిలీజ్ చేస్తామని తెలిపారు. దీనిలో భాగంగా మిరా మిరా మీసం అంటూ వచ్చే టైటిల్ సాంగ్‌ని ఈ నెల 3వ తేదీని రిలీజ్ చేశారు. ఆ సాంగ్‌కు విపరీతమైన స్పందన రావడంతో గతంలో ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
యూట్యూట్‌లో అయితే సంచలనం సృష్టించింది. అయితే సెకండ్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోన్న అభిమానులను ఆరు రోజుల తర్వాత పలకరించాడు కాటమరాయుడు. లాగే లాగే పేరిట రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా అనూప్ రూబెన్స్ తన మార్క్ మెలోడీ టచ్‌తో మంచి బీట్స్ ఇచ్చారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మార్చి 24న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.