కోల్‌కతా ఇస్కాన్ నుంచి 'కార్తికేయ2'కు పిలుపు!
on Jul 19, 2022

నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ 2' మూవీ ట్రైలర్‌ను కోల్‌కతాలోని బృందావనం క్షేత్రంలో విడుదల చేయనున్నారు. అలాగే సినిమా రిలీజ్ డేట్‌ను అక్కడే అనౌన్స్ చేస్తారు. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసిన నిఖిల్.. అందులో ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్)ను సందర్శించాలంటూ అక్కడ నుంచి ఆహ్వానం అందుకున్నామని వెల్లడించాడు.
"ఇస్కాన్ నుంచి 'కార్తికేయ 2' టీమ్ ఒక ఇన్విటేషన్‌ను అందుకుంది. మా ఫిల్మ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న వాళ్లు, బృందావనంలో తమ ఆలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. మా టీజర్‌ను ప్రదర్శించే అవకాశం కూడా వారిచ్చారు. కాబట్టి, అక్కడ అన్ని భాషలకు చెందిన టీజర్స్ మంగళవారం విడుదలవుతాయి. అక్కడి నుంచే మా సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం. ఈ ఆహ్వానం మేరకు మేం బృందావనం ఇస్కాన్‌కు వెళ్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇస్కాన్‌కు ధన్యవాదాలు" అని ఆయన చెప్పాడు.
ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారామ్ దాస్ పంపిన అసలైన ఇన్విటేషన్‌ను కూడా నిఖిల్ షేర్ చేశాడు. "ఈ కథ వెనుక ఉన్న ప్రేరణ గురించి, శ్రీకృష్ణుని జీవితం, మహిమల గురించి మా భక్తులందరితో మాట్లాడటానికి మా బృందావనం క్షేత్రాన్ని సందర్శించాల్సిందిగా కార్తికేయ టీమ్‌ను ఇస్కాన్ సాదరంగా ఆహ్వానిస్తోంది. భక్తులుగా, శ్రీకృష్ణ సారాన్ని మీ దృక్కోణం నుంచి వినేందుకు మేం అందరం కుతూహలంతో ఉన్నాం. మనసారా మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం" అని ఆ ఆహ్వానపత్రంలో రాసుకొచ్చారు.
చందూ మొండేటి డైరెక్ట్ చేసిన 'కార్తికేయ 2' మూవీ నిజానికి జూలై 22న విడుదల కావాల్సి ఉంది. అయితే, తర్వాత దాన్ని వాయిదా వేశారు. ఈరోజు బృందావనం ఇస్కాన్‌లో కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారు. ఇందులో నిఖిల్ సరసన నాయికగా అనుపమ పరమేశ్వరన్ నటించింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



