పుట్టిన రోజున ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చిన కార్తీ..!
on May 25, 2016

ఈరోజుతో 39వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు తమిళ నటుడు కార్తీ. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంటరైనా నటనతో, సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తమిళంలోనే కాక, తెలుగులో కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. లేటెస్ట్ గా ఊపిరితో తెలుగులో మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న కార్తీ, తన బర్త్ డే సందర్భంగా, ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చాడు. అభిమానులకు మరింత క్లోజ్ గా ఉండాలని డిసైడ్ అయిన కార్తీ, ట్విట్టర్లో ఎకౌంట్ ఓపెన్ చేశాడు. @karthi_offl అనేది కార్తీ ట్విట్టర్ హ్యాండిల్ పేరు. కొత్త ప్రపంచంలోకి, కొత్త అనుభవంలోకి అడుగుపెడుతున్నా. నన్నింత ప్రేమిస్తున్న అందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లో కార్తీ నటిస్తున్నాడు. ఒకటి హర్రర్ థ్రిల్లర్ కాశ్మోరా కాగా, మరొకటి మణిరత్నం దర్శకత్వంలో లవ్ ఎంటర్ టైనర్. ఈ ఏడాది కూడా తనకు బాగా కలిసొస్తుందని ఆశిస్తున్నాడు కార్తీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



