
'బేబీ' మూవీతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న అచ్చ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya).మొదటి సినిమాతోనే అద్భుతమైన పెర్ఫార్మ్ కనబరిచి, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత చేసిన చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ప్రేక్షకులు బేబీ ఇమేజ్ తోనే వైష్ణవిని చూస్తున్నారా అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో అప్ కమింగ్ మూవీ 'ఎపిక్' పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఆనంద్ దేవరకొండ(Anandh deverakonda)హీరో కాగా 90 's ఫేమ్ ఆదిత్య హాసన్(Aditya haasan)దర్శకుడు. రీసెంట్ గా ఎపిక్ కి సంబంధించిన టీజర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైష్ణవి ఒక ప్రశ్న ఎదురు కావడంతో తడబాటుకి గురైంది. ఆ డీటెయిల్స్ చూద్దాం.
ఒక విలేకరి వైష్ణవితో బేబీ తర్వాత ఇమేజ్ చేంజ్ ఓవర్ అవసరమైంది కదా.. అది ఎపిక్ అనుకోవచ్చా అని అడిగాడు. దీంతో ఏం చెప్పాలో తెలియక వైష్ణవి ఇబ్బంది పడటంతో పాటు సమాధానం చెప్పలేకపోయింది. వెంటనే ఆదిత్య హాసన్ స్పందిస్తు ఎవరి కోణంలో మార్పని అడిగాడు. ఆనంద్ కూడా మాట్లాడుతూ కెరీర్ అంతా ఒకే ఇమేజ్ ని కొనసాగించలేం. మూవీలోని క్యారక్టర్ ని బట్టి కూడా ఉంటుంది. ఎపిక్ లో చాలా బలమైన ఫిమేల్ రోల్ చేస్తుందని చెప్పుకొచ్చాడు.
Also read: Pooja hegde: పెళ్లి పీటలు ఎక్కబోతున్న పూజాహెగ్డే!..పెళ్లి కొడుకు ఈ హీరోనే!






.webp)
