ఛత్రపతి అవతారమెత్తిన ‘కాంతార’ హీరో.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పోస్టర్!
on Dec 3, 2024
ఛత్రపతి శివాజీ జీవిత కథతో ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటికి చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా కాంతార హీరో రిషబ్ శెట్టి ఆ క్యారెక్టర్‌కి జీవం పోసే పనిలో ఉన్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ సందీప్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్.. ఛత్రపతి శివాజీ మహరాజ్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 జనవరి 21న చాలా భాషల్లో విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలో రాజా శివాజీ పేరు ఓ సినిమా తెరకెక్కుతోంది. అతని డైరెక్షన్‌లో సతీమణి జెనీలియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరో పక్క రిషబ్‌శెట్టి సినిమా కూడా ప్రారంభమైంది. ఛత్రపతి శివాజీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఈ రెండు సినిమాల్లో ఆవిష్కరించనున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. రిషబ్ శెట్టి.. ఛత్రపతి గెటప్‌లో అద్భుతంగా ఉన్నాడనే ప్రశంసలు వస్తున్నాయి.
‘మన గౌరవం, భారతదేశపు గ్రేటెస్ట్ వారియర్ కింగ్ శివాజీ మహారాజ్ యొక్క ఎపిక్ సగాను సినిమా రూపంలో తీసుకొస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఎవరికీ తెలియని ఛత్రపతి శివాజీ మహారాజ్ కథని మేము చెప్పబోతున్నాం. ఇంతకముందెన్నడూ చూడని సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నాంలి అని మేకర్స్ పేర్కొన్నారు. ఒక సాధారణమైన సినిమాగా విడుదలైన కాంతార చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. రూ.400 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు రిషబ్. ప్రస్తుతం ‘కాంతార’ ప్రీక్వెల్‌గా ‘కాంతార - ఎ లెజెండ్: ఛాప్టర్ 1’ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ‘హనుమాన్’ సీక్వెల్ గా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ‘జై హనుమాన్’ మూవీలో రిషబ్ నటిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
