'కాంతార'ను 2 కోట్లకు కొంటే, ఒక్క వారంలోనే 9 కోట్ల లాభం తెచ్చింది!
on Oct 22, 2022

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన 'కాంతార' చిత్రం కన్నడంలోనే కాదు, తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ అయ్యింది. వరాహాన్ని గొప్పగా చూపిస్తూ, అడవితో ఆడుకుంటే ఏం జరుగుతుందో చూపించే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. హోంబళే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీని తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ సినిమా మన ముందుకు వచ్చి వారం రోజులు గడిచాయి. తెలుగు వెర్షన్ బిజినెస్ వాల్యూ రూ. 2 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా, ఇప్పటివరకూ ఏడు రోజుల్లో ఆ సినిమా రూ. 11.37 కోట్ల షేర్‌ను వసూలు చేసిందని సమాచారం. అంటే రూ. 9 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్‌కు లాభం వచ్చిందన్న మాట. దీన్ని బట్టి ఇది ఏ స్థాయి బ్లాక్‌బస్టరో అర్థమవుతోంది.
ట్రేడ్ వర్గాల ప్రకారం మొదటిరోజు రూ. 2.1 కోట్లు, రెండో రోజు రూ. 2.8 కోట్లు, మూడో రోజు రూ. 1.9 కోట్లు, నాలుగో రోజు రూ. 1.45 కోట్లు, ఐదో రోజు రూ. 1.36 కోట్లు, ఆరో రోజు రూ. 1.11 కోట్లు, ఏడో రోజు రూ. 65 లక్షలు షేర్ రూపంలో తెలుగు 'కాంతార' రాబట్టింది. ఏరియాల వారీగా చూస్తే, తెలంగాణలో రూ. 5 కోట్ల షేర్‌ను సాధించిన ఈ సినిమా ఆంధ్రాలో రూ. 4.9 కోట్లు, రాయలసీమలో రూ. 1.47 కోట్ల షేర్‌ను రాబట్టింది.
సప్తమి గౌడ, కిశోర్, అచ్యుత్ కుమార్, మానసి సుధీర్ కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి హనుమాన్ చౌదరి రాసిన సంభాషణలు, రజనీష్ లోకనాథ్ సంగీతం, అరవింద్ ఎస్. కశ్యప్ ఛాయాగ్రహణం ఎస్సెట్‌గా నిలిచాయి. అన్నింటికీ మించి రిషబ్ శెట్టి నటన, ఒళ్లు గగుర్పాటు కలిగించే క్లైమాక్స్, భూతకోలకు సంబంధించిన సన్నివేశాలు, ఆద్యంతం ఊపేసే భావోద్వేగాలు.. 'కాంతార'కు ఇంతటి ఘన విజయాన్ని సాధించిపెట్టాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



