‘కాంతార2’ మూవీ క్రేజీ అప్‌డేట్స్
on Sep 26, 2023
గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా మినిమం బడ్జెట్‌తో రూపొంది ఏకంగా రూ. 450 కోట్ల వసూళ్లను సాధించి అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసిన కన్నడ సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు ప్రీక్వెల్ రాబోతున్న సంగతి విదితమే. ‘కాంతార 2’ పేరుతో ఈ ప్రీక్వెల్‌ను రూపొందించటానికి కావాల్సిన సన్నాహాలన్నీ జరుగుతున్నాయి. రిషబ్ శెట్టి చాలా రోజుల నుంచి ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. నవంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని శాండిల్ వుడ్ సర్కిల్స్ అంటున్నారు. హోంబలే ఫిలింస్ ఈ సినిమాను ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రీక్వెల్‌ను నిర్మించనుంది.
కాంతార సాధించిన సునామీ ఎఫెక్ట్ కారణంగా ‘కాంతార 2’పై ఎలాంటి ఎక్స్‌పెక్టెషన్స్ ఉంటాయనే విషయం రిషబ్ శెట్టి అర్థం చేసుకున్నారు. అందుకనే ఈ ప్రీక్వెల్‌పై బాగా కసరత్తులు చేసి సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. అందులో భాగంగా ప్రతీ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ ప్రీక్వెల్‌కు సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. అవేంటంటే ప్రీక్వెల్ కథ 301 AD జనవరి 1 నుంచి ప్రారంభమైన 31 Dec 400 AD వరకు జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. కాంతార 2 కోసం రిషబ్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. క్యారెక్టర్ కోసం ఏకంగా 11 కిలోల బరువు తగ్గారని సమాచారం. నాలుగో శతాబ్దంలో నడిచే ఈ కథను తెరకెక్కించటానికి ప్రత్యేకమైన సెట్స్ కూడా సిద్ధం చేస్తున్నారు మేకర్స్ హోంబలే ఫిలింస్.
‘కాంతార 2’ సినిమా ను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. భారీ అంచనాలతో రూపొందబోయే ‘కాంతార 2’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే మరి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
