థాయ్‌లాండ్‌కి హీరో సూర్య
on Sep 26, 2023
పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా నెక్ట్స్ ఇయర్ కోసం ఎదురు చూస్తోన్న సినిమాల లిస్టులో కంగువా కూడా ఒకటి. ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాది ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన వెర్సటైల్ హీరో సూర్య ఇందలో కథానాయకుడు. శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా దీన్ని మేకర్స్ రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీగా కంగువా సందడి చేయటానికి ఏకంగా పది భాషల్లో ప్రేక్షకులను పలకరించనున్నారు. ప్రస్తుతం చెన్నైలో వేసిన భారీ సెట్స్‌లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీని తర్వాత ఓ భారీ షెడ్యూల్‌కు డైరెక్టర్ శివ అండ్ టీమ్ ప్లాన్ చేసింది.
సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు నెల రోజుల పాటు చిత్రీకరించాల్సిన భారీ షెడ్యూల్ కోసం కంగువా యూనిట్ థాయ్‌లాండ్ వెళ్లనుంది. అక్కడ కీలకమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్సులను కూడా తెరకెక్కించబోతున్నారట. నవంబర్ చివరికు సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి వి.ఎఫ్.ఎక్స్‌పై డైరెక్టర్ శివ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే సినిమాలో గ్రాఫిక్స్ పాత్ర కీలక భూమికను పోషించనుంది. మూవీని వచ్చే ఏడాది తమిళ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేయటానికి అన్నీ హంగులను సిద్ధం చేస్తున్నారు.
రీసెంట్‌గా సూర్య బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన గ్లింప్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్, ప్రేక్షకులే కాదు సూర్య సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రీన్ స్టూడియో బ్యానర్‌పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సూర్య లైనప్ పెద్దదిగానే ఉంది. ఆయన కోసం ఇతర దర్శకులు, నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
