Home

»

Latest News

వార్నీ "కబాలి" ఫ్యామిలీ సినిమానా..?

Jul 22, 2016 10:03AM

ఇప్పుడిప్పుడే "కబాలి" షోస్ పూర్తి కావస్తున్నాయ్. ఒకొక్కరూ ఒక్కో విధమైన రిపోర్ట్ ఇస్తున్నారు. "పర్లేదు అని కొంతమంది చెబుతుండగా.. ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు" అని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏంటంటే.. "కబాలి" టీజర్ చూసి అందరూ ఈ సినిమా యాక్షన్ డ్రామా అని ఫిక్స్ అయిపోయారు. సినిమా మొత్తం రజనీకాంత్ ఫైట్లు,పంచ్ డైలాగులతో అదరగొట్టేశాడు అనుకొన్నారందరూ. 

కట్ చేస్తే.. మొదటి 15 నిమిషాలు మరియు ఇంటర్వెల్ బ్లాక్ మినహా సినిమా అంతా చాలా స్లోగా సాగుతుందట. ఇక సెకండాఫ్ మొత్తం యాక్షన్ సీన్స్ ఏమీ లేకుండా కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్ తోనే నడుస్తుందని చెబుతున్నారు చూసిన ఆడియన్స్. మరి ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ వరకూ ఒకే.. రజనీకాంత్ అంటే ప్రాణం పెట్టే మాస్ ఆడియన్స్ కు ఎంతవరకూ నచ్చుతుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే.. "తెలుగు వన్" అందించే రివ్యూను మరికొద్ది గంటల్లోనే చదివి మీరు కూడా సినిమాపై ఒక క్లారిటీకి వచ్చేద్దురుగానీ!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com