Home

»

Latest News

అక్కినేని హీరో ఛాన్సులు ఇమ్మంటున్నాడు..!

Nov 1, 2016 3:12PM

ఒడ్డు, పొడుగు, హైట్, వెయిట్ అన్ని కరెక్ట్ గా ఉండి..పైగా గొప్ప ఫ్యామిలీ సపోర్ట్ ఉండి కూడా హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు అక్కినేని సుమంత్. కెరిర్ లో ఇప్పటివరకు 22 సినిమాలు చేసినా..వీటిలో 4,5 చిత్రాలు మాత్రమే హిట్ గా నిలిచాయి. దీంతో రేసులో వెనుకబడిపోయాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ప్రజంట్ నరుడా డోనరుడా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా నాకూ ఛాన్సులివ్వండి అంటూ దర్శక, నిర్మాతలను వేడుకుంటున్నాడు. అదేంటి ఇండస్ట్రీని శాసించే కుటుంబంలోని హీరో ఛాన్సులు అడగటం..దర్శకనిర్మాతలు ఇవ్వకపోవడమా..కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది. సుమంత్ ఛాన్సులు అడుగుతోంది హీరోగా కాదు..విలన్ గా. నాలో హీరోనే కాదు విలన్ కూడా ఉన్నాడు కావాలంటే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అంటూ ప్రెస్ మీట్ లో మనసులోని కోరికను బయటపెట్టాడు. హీరోగా సక్సెస్ కాకపోవడంతో కనీసం విలన్ గా అయినా తన టాలెంట్ చూపిద్దామని సుమంత్ ఆశిస్తున్నట్లున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com