అమెరికాలో కమల్, బ్రహ్మీ ఏం చేస్తున్నారు..?
on May 17, 2016
.jpg)
దశావతారంలోని బలరాం నాయుడు పాత్రలో కమల్ పెర్ఫామెన్స్ అంత తొందరగా మర్చిపోలేం. ఆ పాత్ర నుంచి అల్లిన మరో కథే శభాష్ నాయుడు. ఒక ప్రభుత్వాధికారిగా కేవలం నాయుడు ప్రొఫెషన్ ను మాత్రమే అందుల్లో చూపిస్తే, శభాష్ నాయుడులో మాత్రం అతని పర్సనల్ లైఫ్ ను కూడా చూపించబోతున్నారు. భార్య, కూతురితో అతని అనుబంధం ఎలా ఉంటుందో చూపిస్తూ మరింత కామెడీని జత చేసి తెరకెక్కించామని కమల్ చెబుతున్నారు. ఈ సినిమాలో కమల్ అసిస్టెంట్ గా బ్రహ్మానందం కనిపించడం విశేషం. తెలుగు తమిళ భాషల్లో బ్రహ్మానందం చేస్తుంటే, హిందీలో సౌరభ్ శుక్లా చేస్తున్నారు. దాదాపు సగం పైగా సినిమా షూటింగ్ అమెరికాలోనే జరుగుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టే, బ్రహ్మానందం, కమల్ పాత్రల కామెడీ టైమింగ్, ఛేజింగ్ సీన్స్ ఎలా ఉంటాయో అర్ధమవుతోంది. కమల్, బ్రహ్మీ ఇద్దరూ కూడా సినిమాలోని స్టంట్స్ అన్నింటినీ, బాడీ డబుల్ లేకుండా పెర్ఫామ్ చేయబోతున్నారట. రియల్ లైఫ్ తండ్రీ కూతుళ్లు కమల్, శృతి సినిమాలో కూడా తండ్రీకూతుళ్లుగా, రమ్యకృష్ణ కమల్ భార్యగా కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత ఇళయరాజా కమల్ సినిమాకు సంగీతాన్ని ఇవ్వడం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



