హైదరాబాద్ నుంచి వెళ్లిన కాసేపటికే ఆస్పత్రి పాలైన కమల్ హాసన్!
on Nov 24, 2022

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడటంతో వెంటనే ఆయనను చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు.
ఇటీవల 'విక్రమ్'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కమల్ ప్రస్తుతం 'ఇండియన్-2'తో పాటు తమిళ్ బిగ్ బాస్ షోతో బిజీగా ఉన్నారు. తనకు 'స్వాతిముత్యం', 'సాగరసంగమం' వంటి ఆల్ టైం క్లాసిక్ చిత్రాలను అందించిన కళాతపస్వి విశ్వనాథ్ ని బుధవారం నాడు ఆయన హైదరాబాద్ లో కలిశారు. కానీ ఇంతలోనే అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలు కావడం ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది.
కమల్ ఆమధ్య కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి చెన్నై చేరుకున్నాక ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో హుటహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు, కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించి.. కమల్ ని డిశ్చార్జ్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



