Home

»

Latest News

కమల్‌ హాసన్‌ హెల్త్‌ బులెటిన్‌ విడుదల!

Dec 1, 2021 3:47PM

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే కరోనా నుంచి కమల్ పూర్తిగా కోలుకున్నారని తెలుపుతూ ఆయనకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి తాజాగా హెల్త్ బులెటిన్‌ ను విడుదల చేసింది.

కరోనాతో నవంబర్ 22 న ఆసుపత్రిలో చేరిన కమల్ పూర్తిగా కోలుకున్నారని చెన‍్నైలోని శ్రీ రామచంద్రా మెడికల్ సెంటర్ ప్రకటించింది. కమల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని హెల్త్ బులెటిన్‌ లో తెలిపింది. డిసెంబర్ 3 న డిశ్చార్జ్‌ చేస్తామని, డిసెంబర్ 4 నుంచి కమల్‌ తన పనులను చేసుకోవచ్చని పేర్కొంది.

కమల్ కోలుకున్నారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com