ఇద్దరున్నారు... కానీ ఎవరూ ఐ లవ్ యు చెప్పలేదు..బ్రహ్మ ముహూర్తంలో స్టార్ట్
on Apr 18, 2025
యూనివర్సల్ స్టార్ 'కమల్ హాసన్'(Kamal Haasan)అప్ కమింగ్ మూవీ 'థగ్ లైఫ్'(Thug Life). ప్రీవియస్ మూవీ భారతీయుడు 2 పరాజయం చెందటంతో కమల్ అభిమానుల ఆశలన్నీ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'థగ్ లైఫ్' పైనే ఉన్నాయి. పైగా భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మణిరత్నం(Mani Ratnam)దర్శకుడు కావడంతో పాన్ ఇండియా స్థాయిలోనే భారీ అంచనాలు ఉన్నాయి. శింబు(Silambarasan TR)త్రిష(Trisha Krishnan)అభిరామి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, తనికెళ్ల భరణి, నాజర్ కీలక పాత్రలు పోషించగా లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ 'ఏఆర్ రెహ్మాన్' సంగీతాన్ని అందించాడు.
రీసెంట్ గా 'జింగుచా' అనే లిరిక్ తో కూడిన సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో థగ్ లైఫ్ చిత్ర బృందం పాల్గొని మూవీ కి సంబంధించిన పలు విషయాల్ని ప్రేక్షకులతో పంచుకుంది. కమల్ హాసన్ మాట్లాడుతు ప్రతి రోజు ఈ మూవీ షూటింగ్ బ్రహ్మ ముహూర్తంలోనే ప్రారంభమయ్యేది. 37 ఏళ్ళ క్రితం మణిరత్నం గారి దర్శకత్వంలో 'నాయగన్' లో చేశాను. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు అలాగే ఉన్నారు. మేమిద్దరం కథ గురించి చర్చించుకుంటే 25 శాతం సినిమా పూర్తయినట్టే. త్రిష, అభిరామి ఇద్దరు హీరోయిన్లు ఉన్నా కూడా నాకు 'ఐ లవ్ యు' ఎవరు చెప్పలేదు. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం ఎప్పుడు నా మనసుకు దగ్గరగా ఉంటుంది. శింబు లాంటి వ్యక్తి నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని చెప్పుకొచ్చాడు.
కమల్ కెరీర్ లోనే హై బడ్జెట్ తో తెరకెక్కిన 'థగ్ లైఫ్' ని మణిరత్నం, కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్, శివ అన్నత్ సంయుక్తంగా నిర్మించగా రవి. కె చంద్రన్ ఫొటోగ్రఫీ ని అందించాడు. జూన్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా ఇప్పటికే రిలీజైన టీజర్ అయితే మూవీ పై అంచనాల్ని పెంచిందని చెప్పవచ్చు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
