' కళ్యాణ వైభోగమే ' రివ్యూ
on Mar 4, 2016

జబర్దస్త్ లాంటి ఫ్లాప్ తర్వాత హిట్ జోన్లోకి బౌన్స్ అవడానికి ట్రై చేస్తున్న నందినీ రెడ్డి, నాగశౌర్యతో టీం అప్ అయి తీసిన సినిమా కళ్యాణ వైభోగమే. ఊహలు గుసగుసలాడే తర్వాత, అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగశౌర్యకు కూడా ఈ హిట్ చాలా కీలకం. మరి ఈ ఇద్దరి కలయికలో హిట్ కొట్టారా..? లెట్స్ సీ..
స్టోరీ
శౌర్య (నాగశౌర్య) ఒక గేమ్ డిజైనర్. తన కొత్త డిజైన్ కు అప్రూవల్ రావడంతో, అమెరికా వెళ్లాలనే ప్లాన్ లో ఉంటాడు. కానీ తన బామ్మ ఆఖరి కోరిక అతని పెళ్లి చూడటం. అందుకే ఇక తప్పక పెళ్లికోసం ఆగుతాడు. మరో వైపు దివ్య (మాళవికా నాయర్) ఒక మెడికో. తనకు కూడా సంబంధాలు చూస్తుంటారు. కానీ ఆమెకు మాత్రం అమెరికా వెళ్లి అక్కడ ఎమ్.డి చేయాలని ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ఇద్దరికీ మ్యాచ్ సెట్టవుతుంది. మొదట ఇద్దరూ ఒప్పుకోకపోయినా, తర్వాత అమెరికా వెళ్లాక ఏడాదిలో డైవర్స్ తీసుకుందామని ఫిక్సై ప్లాన్ వేసుకుంటారు. మరి వాళ్ల ప్లాన్ సక్సెస్ అవుతుందా..? ఇద్దరికీ మధ్య అసలు ప్రేమ అనేది ఉందా..? బ్యాలెన్స్ వెండితెర మీదే చూడాలి..
పెర్ఫామెన్స్
నాగశౌర్య వీలైనంత నేచురల్ గా యాక్ట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అక్కడక్కడా మాత్రం, అతనిలో వేరే హీరోలు కనబడుతుంటారు. హీరోయిన్ మాళవికా నాయర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చూడగానే అతిలోకసుందరి అని అనిపించకపోయినా, జనాన్ని కట్టిపడేసే ఆకర్షణ ఆమెలో ఉంది. హీరో పేరెంట్స్ గా ఐశ్వర్య, రాజ్ మాదిరాజ్ లు కామెడీ పండించారు. హీరోయిన్ తల్లిదండ్రులుగా ఒకప్పటి హీరో ఆనంద్, ఒకప్పటి హీరోయిన్ రాశి నటించారు. రాశికి కొన్ని చోట్ల నటనను చూపించే అవకాశం కలిగింది.
టెక్నికల్ గా..
నందినీ రెడ్డి ఇంకా అలా మొదలైంది మ్యాజిక్ నుంచి బయటకు రాలేదు. సేమ్ టు సేమ్ అలాంటి సినిమాయే తీసి హిట్ కొట్టే ప్రయత్నం చేసింది. నిజానికి, కొన్ని ఏమోషన్స్ ను ఇంకా డీప్ కు తీసుకుని వెళ్లి ఉంటే మరింత బాగుండేది. ఇక కళ్యాణ్ కోడూరి అందించిన పాటలు సినిమాకు మేజర్ అసెట్. సాధారణ సీన్స్ ను కూడా, కళ్యాణ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎలివేట్ చేసింది. మిగిలిన డిపార్ట్ మెంట్స్ అన్నీ ఓకే..
ప్లస్ లు
నాగశౌర్య, మాళవికా నాయర్
పాటలు
మైనస్ లు
ల్యాగ్ అయినట్టుండే కథనం
ముందే తెలిసిపోయే కథ, సంభాషణలు
అలా మొదలైందిని గుర్తు తెచ్చే క్లైమాక్స్
తెలుగువన్ వ్యూ
జస్ట్ కళ్యాణమే..వైభోగమేమీ లేదు..టైం పాస్..
రేటింగ్ : 2.5/5
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



