Home

»

Latest News

ఎ.యస్.రవికుమార్, కళ్యాణ్ రామ్ ల రుద్రాక్ష

Apr 8, 2011 11:51AM

nandamuri kalyan ram wallpapers, nandamuri kalyan ram stills, nandamuri kalyan ram images, nandamuri kalyan ram pics, nandamuri kalyan ram photos, nandamuri kalyan ram pictures ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో, కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న "రుద్రాక్ష" చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. వివరాల్లోకి వెళితే యన్.టి.ఆర్.ఆర్ట్స్ పతాకంపై గతంలో అనేక చిత్రాలను నిర్మించిన యువ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తమ బ్యానర్ లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ రవికుమార్ చౌదరి గతంలో "మనసుతో" అనే ఫ్లాప్ చిత్రంతో దర్శకుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, "యజ్ఞం" చిత్రంతో విజయాన్ని చూసి, "వీరభద్ర" చిత్రంతో దారుణమైన ఫ్లాప్ ని బాలయ్యకిచ్చాడు.


అంతటితో ఆగకుండా "ఆటాడిస్తా", "ఏం పిల్లో ఏం పిల్లడో" అంటు మరో ఫ్లాప్ లనిచ్చాడు. అటువంటి రవికుమార్ చౌదరి మరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న "రుద్రాక్ష" సినిమాకు ఎంతవరకు న్యాయం చేయగలడో కాలమే చెప్పాలి. అన్నట్టు ఈ "రుద్రాక్ష" చిత్రంలో నిజజీవితంలో తండ్రీ కొడుకులైన టైగర్ నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్ ఈ "రుద్రాక్ష" చిత్రంలో కూడా తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారని సమాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com