Home

»

Latest News

అన్నా హజారేకి టాలీవుడ్ మద్దతు

Apr 8, 2011 11:16AM

Vijay hazare, Vijay hazare stills, Vijay hazare pics, Vijay hazare images Vijay hazare wallpapersతెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు అన్నాహజారే "లోక్ పాల్‍" బిల్లు కోసం చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు...తెలుపుతూ ఉన్నారు. అసలు ఈ "లోక్ పాల్" బిల్లంటే ఏమిటి...? ఇదీక అటానమస్ అథారిటీ. అంటే ఒక ప్రత్యేకప్రతిపత్తి కలిగిన బిల్లు. ఈ బిల్లు ప్రకారం ఎటువంటి రాజకీయ నాయకులైనా, ఐ ఎ యస్, ఐ పి యస్ అధికారులైనా.... అంతెందుకు మన దేశంలోని ఎవరైనా సరే ఆదాయానికి మించి ఆస్తులున్నా, ఆదాయపు పన్ను ఎగవేసినా ఈ "లోక్ పాల్" బిల్లు ద్వారా విచారణకు పాత్రులవుతారు.


హీరో సిద్ధార్థ తన ట్విట్టర్ లో ఇలా వ్రాశాడు. " మనకోసం అన్నా హజారే వంటి నాయకుడు నిరాహార దీక్ష చేస్తుంటే నాకు భోజనం చేయాలనిపించలేదు. అందుకనే ఆయనకు మద్దతుగా ఈ రోజు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను.మరి మీరూ...?" అని తన ట్విట్టర్ లో వ్రాసుకున్నాడు.

Vijay hazare, Vijay hazare stills, Vijay hazare pics, Vijay hazare images Vijay hazare wallpapers

ప్రముఖ హీరో, నిర్మాత, మీదు మిక్కిలి విద్యాదాత అయిన కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు తిరుపతిలోని తన శ్రీ విద్యా నికేతన్ విద్యార్థులతో అన్నా హజారేకు మద్దతుగా ఒక నిశ్శబ్ద ర్యాలీని నిర్వహిస్తూ ఈ ర్యాలీలో పాల్గొనవలసినదిగా ప్రజలందరికి మనవి చేశారు.


అదే విధంగా యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ లో " హలో మై ఫ్రెండ్స్ అన్నా హజారేకు మద్దతు పలకండి. కామతి వంతమైన, అవినీతి రహిత రేపటి భారత దేశం కోసం అన్నా హజారేతో గోంతు కలపండి.జైహింద్" అని వ్రాసి అన్నా హజారేకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.


అన్నా హజారే చేస్తున్న పోరాటానికి అపజయమెరుగని యువ డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి తన బలమైన మద్దతు ప్రకటిస్తూ " ఇది భారతదేశ చరిత్రలో అవినీతి అంతానికి ప్రారంభం మాత్రమే, మనమంతా అన్నా హజారేకి మద్దతు తెలుపుదాం" అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Vijay hazare, Vijay hazare stills, Vijay hazare pics, Vijay hazare images Vijay hazare wallpapers

ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ధర్నా పార్క్ వద్ద అన్నాహజారేకి మద్దతుగా ఇందిరా పార్క్ కి ఆపోజిట్ గా ఉన్న ధర్నా చౌక్ లో జనం చేయబోయే ధర్నాలో స్వచ్చందంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా " డబ్భై యేళ్ళ వయసులో ఆయన లోక్ పాల్ బిల్ కోసం నిరాహార దీక్ష చేస్తున్నారంటే అది తన కోసం కాదు. తన మాతృదేశంలో రాబోయే తరం అవినీతిరహిత భారతంలో బ్రతకాలనే ఆయన ఈ దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా నేను "లోక్ పాల్" బిల్లు కోసం ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్షలో, ధర్నాలో పాల్గొంటున్నాను.


వీరే కాక ఇంకా మురళీ మోహన్, ప్రకాష్ రాజ్, సింగర్ అనుజ్ గుర్వారా, శ్రియ శరణ్‍, అమీర్ ఖాన్, ఇషా కొప్పీకర్, ఫర్హాన్ అక్తర్, నేహా ధూపియా, ఇకి మన హీరో దగ్గుబాటి రానా అయితే అన్నా ఏకంగా " హజారే మోడ్రన్ గాంధీ లా పోరాడుతున్నారు...మరి మోడ్రన్ నెహ్రూ ఎవరు...?" ప్రశ్నించారు.


అన్నా హజారే పోరాటం మీ కోసం, నాకోసం, మనందరి కోసం, మన దేశం బాగు కోసం. మన దేశంలోని అవినీతిని అంతం చేయటం కోసం. కనుక ఆయనకు మద్దతు తెలిపి, ఆయన పోరాటంలో పాలుపంచుకోవటం ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత. రండి.... అన్నా హజారే పోరాటంలో చేయికలపండి......

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com