
ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ రూపంలో వైవిధ్యం చూపించడానికి ట్రై చేస్తుంటాడు కల్యాణ్ రామ్. కథ పరంగా ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కల్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ కి మాత్రం మంచి మార్కులే పడుతుంటాయి. తాజాగా ఇజం సినిమా కోసం ఈ నందమూరి హీరో సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన పోస్టర్‌ని ఈ రోజు విడుదల చేసింది చిత్రబృందం. నందమూరి హరికృష్ణ 60వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా... కల్యాణ్ రామ్ 6 ప్యాక్ పోస్టర్‌ని మీడియాకు విడుదల చేసింది టీమ్. పటాస్ తరవాత కల్యాణ్ రామ్ సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. పైగా ఈ సినిమాకి పూరి దర్శకుడు. కాబట్టి.. ఇజంపై టాలీవుడ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజులో ఉన్నాయి. ఎన్టీఆర్ తో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు పూరి. పూరిని ఎన్టీఆర్ నమ్మాలంటే కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిందే. అందుకే పూరి కూడా తన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాడని తెలుస్తోంది.






