Home

»

Latest News

ఎన్టీఆర్ కంటే  మోహ‌న్ లాల్ కి ఎక్కువిచ్చారా?

Sep 2, 2016 2:27PM


జ‌న‌తా గ్యారేజ్‌లో మోహ‌న్‌లాల్ ఓ కీ రోల్ చేశాడు. హీరో త‌ర‌వాత అంత స్థాయి ఉన్న పాత్ర‌. అందుకోసం మోహ‌న్ లాల్ ఎంత తీసుకొన్నారు?  ఈ సినిమాతో ఆయ‌న‌కు ముట్టింది ఎంత‌?  ఈ లెక్క‌లు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ అంకెలు చూస్తే ఎవ్వ‌రికైనా దిమ్మ‌తిర‌డం ఖాయం. ఎందుకంటే.. హీరో రెమ్యున‌రేష‌న్ కంటే, ద‌ర్శ‌కుడు తీసుకొన్న‌దానికంటే ఎక్కువ మొత్తంలో అందుకొన్నారాయ‌న‌. ఈ సినిమా కోసం రెమ్యున‌రేష‌న్ బ‌దులుగా మ‌ల‌యాళం రైట్స్ అందుకొన్నాడు కొర‌టాల‌. మ‌ల‌యాళంలో ఈసినిమా రూ.12 కోట్ల‌కు అమ్మేశారు. శాటిలైట్ కింద రూ.5 కోట్లు వ‌చ్చాయి. అంటే.. మొత్తం రూ.17 కోట్ల‌న్న‌మాట‌. మైత్రీ మూవీస్ మ‌రో రూ.2 కోట్లు మోహ‌న్ లాల్‌కి ముట్ట‌జెప్పింద‌ట‌. ఆ లెక్క‌న మోహ‌న్ లాల్‌కి రూ.19 కోట్లు అందాయ‌న్న‌మాట‌. ఎన్టీఆర్ పారితోషికం రూ.11 కోట్ల ద‌గ్గ‌ర ఆగిపోయింది. కొర‌టాల కూడా దానికి అటూ ఇటూగా అందుకొన్నాడు. అంటే జ‌న‌తా గ్యారేజ్ వ‌ల్ల లాభ‌ప‌డింది మోహ‌ల్ లాల్ అన్న‌మాట‌. మోహ‌న్ లాల్ న‌టించిన మ‌న‌మంతా సినిమాకి మాత్రం ఆయ‌న‌కు రూ.4 కోట్లే ద‌క్కాయి. ఎంతైనా స్టార్ హీరో సినిమా అంటే ఆ లెక్క‌లే వేరుగా ఉంటాయి. ఇంత‌కీ... మోహ‌న్ లాల్ మ‌ల‌యాళంలో ఎంత తీసుకొంటారో తెలుసా..??   రూ.4 నుంచి రూ.5 కోట్లు మాత్ర‌మే. అంటే మ‌ల‌యాళంలో హీరోగా చేసుకోవ‌డం కంటే.. తెలుగులో ఇలాంటి కీ రోల్స్ చేసుకోవ‌డం న‌య‌మ‌న్న‌మాట‌.  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com