
నందమూరి అభిమానులంతా గౌతమి పుత్ర శాతకర్ణి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త బయటకువచ్చినా.. వాళ్లకు పండగే. అలాంటిది ఇప్పుడు ఫొటోలే బయటకువచ్చేశాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో లోని గ్వాలియర్ కోటలో బాలకృష్ణ, శ్రియ, హేమామాలినికి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వీటికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఆన్‌లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. శ్రియ గెటప్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒడిలో చంటిపిల్లాడ్ని పట్టుకొన్న శ్రియ ఫొటో... ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతోందో తేటతెల్లం చేయబోతోంది. చక్రవర్తి గెటప్‌లో బాలకృష్ణ కోటలోకి వస్తున్న ఫొటో కూడా అభిమానుల్ని ఆకట్టుకొనేదే. ఈ ఫొటోల్ని షేర్ చేసుకొంటూ బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకొంటే.. చిత్రబృందానికి మాత్రం టెన్షన్ పుట్టుకొచ్చింది. ఈ ఫొటోలు ఎలా లీకయ్యాయో.. వాటిని ఎలా ఆపాలో కూడా క్రిష్ బృందానికి తెలియడం లేదు. దాంతో.. సెట్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొంటోంది చిత్రబృందం.






.jpg)
