'బింబిసార' ఫ్రాంచైజ్ లో తారక్.. రివీల్ చేసిన కళ్యాణ్ రామ్!
on Jul 4, 2022
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న లేటెస్ట్ మూవీ 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ్ దర్శకుడు. ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
రేపు(జులై 5న) కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కానుకగా 'బింబిసార' ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. ట్రావెల్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ విజువల్ వండర్ లా ఉంది. 'బింబిసార' పాత్రలో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడు. ఇక కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇదిలా ఉంటే హైదరాబాద్ లో జరిగిన 'బింబిసార' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశాడు. 'బింబిసార' ఫ్రాంచైజ్ నుంచి కనీసం నాలుగు భాగాలు వస్తాయని అన్నాడు. సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది ఆగష్టు లో విడుదలవుతుందని తెలిపాడు. అలాగే ఇటీవల డైరెక్టర్ వశిష్ఠ్ తో ఓ స్టోరీ డిస్కషన్ జరిగిందని.. అంతా అనుకున్నట్లు జరిగితే ఒక పార్ట్ లో తాను, తమ్ముడు తారక్(జూనియర్ ఎన్టీఆర్) కలిసి నటిస్తామని కళ్యాణ్ రామ్ చెప్పాడు.
Also Read