‘కల్కి’ మేకర్స్ బంపర్ ఆఫర్.. ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
on Jul 19, 2024
టైమ్ బాగుంటే అన్నీ కలిసి వస్తాయంటారు కదా. ఇప్పుడు ప్రభాస్ టైమ్ బాగున్నట్టుంది. అందుకే ‘కల్కి’కి ఎదురు నిలిచే సినిమా ఇప్పటికీ రాలేదు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది. మూడు వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని నాలుగో వారంలోకి అడుగు పెడుతున్న ఈ సినిమాకి పోటీ ఇచ్చే ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదంటే అది టైమ్ మహత్యమే. ఇప్పటికే వెయికోట్ల మార్క్‌ను దాటేసిన ‘కల్కి’ కొత్త రికార్డులు సృష్టించేందుకు పొంచి ఉంది.
ఇదిలా ఉంటే.. ‘కల్కి’ మేకర్స్ పిల్లల కోసం ఓ ప్రత్యేకమైన ఆఫర్ పెట్టారు. ఇది గోల్డెన్ ఛాన్స్ అన్నీ, దాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దని మరీ మరీ చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటంటే.. పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కల్కి’ సినిమాలోని సెట్‌ను చూసే అవకాశం కల్పిస్తున్నారు నిర్మాతలు. అలా చూడాలంటే.. ఏం చెయ్యాలో వారి తల్లిదండ్రులకు సూచించారు. వారి పిల్లల్ని ముందుగా కల్కి సినిమా గురించి మాట్లాడిస్తూ వీడియో చెయ్యాలి. ఆ వీడియోను నిర్మాతలకు పంపించాలి. అలా వచ్చిన వీడియోల్లోంచి బెస్ట్ వీడియోలను సెలెక్ట్ చేసి వారందరికీ సెట్‌ని చూసి ఎంజాయ్ చేసే ఛాన్స్ కల్పిస్తున్నారు.
ఈ కాంటెస్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను వైజయంతి మూవీస్ సంస్థ సోషల్ మీడియాలో తెలియజేస్తూ ‘మీ చిన్నారులకు కల్కి సెట్స్‌ను చూపించాలనుకుంటున్నారా? మీ చిన్నారి కల్కి గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి మాకు పంపండి. కల్కి సెట్స్‌ను చూసే అద్భుత అవకాశాన్ని పొందండి! మీ వీడియోలకు #ILOVEKALKI అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేయండి’ అని సూచించింది. వైజయంతి మూవీస్ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్‌పై ఎంతమంది పిల్లలు స్పందిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



