
కాజల్ అగర్వాల్ నుంచి ఈ ఏడాది వచ్చిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’. థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి తాజాగా తెలుగు, తమిళ వెర్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు చేతన్ డీకే దర్శకత్వం వహించారు. సాగర్ బి. షిండే కథ అందించడంతో పాటు నిర్మించారు. జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించాయి.
జూలై 24న థియేటర్లలోకి వచ్చిన ‘ది ఇండియా స్టోరీ’.. మొదట హిందీ భాషలోనే విడుదలైంది. సినిమా కథాంశం కారణంగా విడుదలకు ముందు నుంచే చర్చకు వచ్చింది. వ్యవసాయంలో పెస్టిసైడ్స్ వినియోగం, ఆహార కల్తీ, వాటి వల్ల ప్రజల ఆరోగ్యంపై పడే ప్రభావం వంటి అంశాలను కథలో ప్రస్తావించారు.
కథ విషయానికి వస్తే.. సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేసిన యోగేష్ పాటిల్ తన చిన్న కుమార్తె క్యాన్సర్‌తో చనిపోవడంతో షాక్‌కు గురవుతాడు. తన కుమార్తె అనారోగ్యానికి వ్యవసాయంలో ఉపయోగించే రసాయనాలే కారణమని అనుమానిస్తాడు. దీంతో ఈ వ్యవహారంపై న్యాయపోరాటానికి దిగుతాడు.
ఈ పోరాటంలో అతడికి లాయర్ అర్చనా అండగా నిలుస్తుంది. ఈ పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించింది. పెస్టిసైడ్స్ తయారు చేసే కంపెనీలు, కల్తీ వ్యవహారాలపై వీరిద్దరూ న్యాయపోరాటం చేయడం.. ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలే సినిమా ప్రధాన కథ.

థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 18 నుంచి జియో హాట్ స్టార్ లో ‘ది ఇండియా స్టోరీ’ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మొదట కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తాజాగా సెప్టెంబర్ 30 నుంచి తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
ఇక ఓటీటీలోకి రావడంతో కాజల్ అభిమానులకు ఈ సినిమాను తెలుగులో చూసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా కాజల్ ఇందులో రెగ్యులర్ కమర్షియల్ పాత్రలకు భిన్నంగా లాయర్ పాత్రలో కనిపించడం ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: ఆగిపోయిన నివిన్ పౌలీ 'సంచారి' రిలీజ్.. కారణం తెలిస్తే షాకవుతారు.!
[The India Story Telugu OTT Release, Kajal India Story Movie, The India Story OTT, Kajal Aggarwal, The India Story Movie, Kajal New Movie, Telugu OTT Movies, Telugu Film News]





