
'రెడీ' సినిమాలో 'చిట్టి నాయుడు'గా మాస్టర్ భరత్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. 'రెడీ'నే కాదు.. 'వెంకీ', 'ఢీ', 'కింగ్' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన అద్భుతమైన కామెడీతో అలరించిన భరత్ ను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అప్పుడు రీల్ లైఫ్‌లో అల్లరి పిల్లవాడిగా మనల్ని ఎంతగానో అలరించిన చిట్టి నాయుడు.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో డాక్టర్‌గా మారి స్టెతస్కోప్ చేతపట్టారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
మాస్టర్ భరత్ చేసిన ఎన్నో కామెడీ రోల్స్ టాలీవుడ్ హిస్టరీలోనే నిలిచిపోతాయి. చిన్న వయసులోనే ఏకంగా 80కి పైగా సినిమాల్లో నటించి, స్టార్ హీరోలకు సమానంగా థియేటర్లలో విపరీతమైన నవ్వుల పంట పండించారు. భరత్ కోసమే కొన్ని సినిమాలు రిపీటెడ్ గా చూసిన ఆడియన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల చప్పట్లే కాదు.. రెండు నంది అవార్డులు కూడా భరత్ గెలుచుకున్నారు.
అయితే, ఒక వైపు ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా క్రేజ్, వరుస ఆఫర్లు, స్టార్‌డమ్ తలుపు తడుతున్న సమయంలో.. భరత్ ఒక బిగ్ అండ్ డిఫికల్ట్ డెసిషన్ తీసుకున్నారు. గ్లామర్ వరల్డ్, అవార్డులు, చప్పట్లు.. వీటన్నింటినీ పక్కన పెట్టి, తన చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.

సినిమాలకు కొంతకాలం పూర్తిగా దూరమై, రాత్రింబవళ్లు కష్టపడి చదివి, చివరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ప్రస్తుతం ఆయన వైద్య రంగంలో తన సరికొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. డాక్టర్‌గా పట్టా అందుకొని, ప్రజలకు సేవ చేయాలనే ఒక గొప్ప ఆశయంతో ముందుకు సాగుతున్నారు.
ఒక వైపు చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్‌డమ్ చూసి, మళ్లీ దాన్ని పక్కన పెట్టి, మెడికల్ సీట్ సంపాదించి డాక్టర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత, కష్టం కావాలి. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, టాలీవుడ్ అభిమానులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "అప్పట్లో తన నటనతో ప్రతీ ఇంట్లో నవ్వులు పూయించిన భరత్.. ఇప్పుడు డాక్టర్‌గా మారి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది" అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇది కూడా చదవండి: ది ఇండియా స్టోరీ.. ఓటీటీలోకి కాజల్ అగర్వాల్ కాంట్రవర్సీ మూవీ.!
[Master Bharath Inspiring Journey, Master Bharath Doctor, Master Bharath Career Change, Ready Chitti Naaidu, Master Bharath Movies, Master Bharath Comedy, Master Bharath Story, Child Artist Bharath, Telugu Film News]






