కాజల్ ను ఆ భయం పట్టుకుందట..
on Sep 17, 2016

నేను పక్కా లోకల్.. పక్కా లోకల్ అంటూ 'జనతా గ్యారేజ్' సినిమాలో ఐటెం సాంగ్ చేసిన కాజల్ కు ఈ సినిమా తరువాత ఒకటే ఆఫర్లు వస్తున్నాయట. టాలీవుడ్ నుండి ఏమో కానీ.. కోలివుడ్ నుండి ఈ ఆఫర్లు ఎక్కువయ్యాయట. అంతేకాదు.. ఎంత పారితోషికం ఇవ్వడానికైనా రెడీ అవుతున్నారట. కానీ.. పాపం కాజల్ మాత్రం ఐటెం సాంగ్స్ చేయడానికి ససేమీరా అంటోంది. 'జనతా గ్యారేజ్' అంటే ఎన్టీఆర్ తో ఉన్న స్నేహం వల్ల చేయడానికి ఒప్పుకున్నాను అంతేకానీ ఇకపై జీవితంలో అలాంటి పాటలు చేయనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తోంది. అసలే కాజల్ కెరీర్ బాగోలేదు. అవకాశాలు కూడా తక్కువే. ఇలా తాను వరుసగా ఐటం సాంగులు చేసుకుంటూ పోతే తనకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయి ఐటం గర్ల్ గా మిగిలిపోతాననే భయంతోనే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మరి చూద్దాం.. ఈ మాటపై కాజల్ ఎంత వరకూ నిలబడుతుందో... కాగా ప్రస్తుతం కాజల్ చిరంజీవి సరసన 150వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



