కాజల్ బొడ్డుపై - చెర్రీ పండు
on Apr 20, 2015

రాఘవేంద్రరావు సినిమా అంటే హీరోయిన్ల అందాల స్వర్గధామం అని చెప్పుకోవచ్చు. కథానాయిక బొడ్డుపై పండ్లు, పూలు ధారబోస్తారు. పాలాభిషేకం కూడా చేస్తారు. హీరోయిన్ ఎవరైనా సరే.. పండ్లతో కొట్టాల్సిందే. ద్రాక్ష, బత్తాయి, యాపిల్, జామ.. ఇలా ఒక్కటీ వదల్లేదాయన. కాజల్‌కి మాత్రం.. చెర్రీ పండుతో కొట్టించుకోవాలని ఉందట. ఈ విషయాన్ని కాజలే స్వయంగా చెప్పింది. కె.రాఘవేంద్రరావు నిర్వహిస్తున్న సౌందర్యలహరి కార్యక్రమానికి కాజల్ అతిథిగా వచ్చింది. ''రాఘవేంద్రరావు సినిమాలో నటించే అవకాశం వస్తే.. బొడ్డుపై ఏ పండు విసరమంటారు..?'' అని యాంకర్ ఝాన్సీ అడిగింది. దానికి కాజల్ ఏమాత్రం ఆలోచించకుండా `చెర్రీ పండు` అనేసింది. ఇప్పటి వరకూ రాఘవేంద్రరావు చెర్రీ పండుతో హీరోయిన్‌ని కొట్టలేదట. అందుకే రాఘవేంద్రరావు కూడా ''ఓయస్..'' అనేశారు. అంటే కాజల్‌పై త్వరలోనే చెర్రీ పండ్లు లారీలు లారీలు దొర్లించడానికి.. రాఘవేంద్రుడు రెడీ అయిపోయాడన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



