కబాలీ అలా ఫిక్సయ్యాడట..!
on May 19, 2016
.jpg)
నిజం చెప్పాలంటే కబాలీ గురించి ఎవరికీ ఎలాంటి అభిప్రాయాలు లేవు. వరస ఫ్లాపుల తర్వాత రజనీ తీస్తున్న సినిమా కావడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడయితే టీజర్ రిలీజైందో, ఆ తర్వాత రజనీ ఫీవర్ మొదలైపోయింది. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న రజనీ ఫ్యాన్స్, తమ సూపర్ స్టార్ మళ్లీ హిట్ కొట్టబోతున్నాడనే నమ్మకంతో అంచనాల్ని పెంచేసుకున్నారు. సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు శుభవార్త చెప్పాడు నిర్మాత కలైపులి ఎన్ థాను. జూన్ తొలివారం లో ఆడియో వేడుక ఉంటుందని, జూలై 1న మూవీని రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. టీజర్ లో రజినీ చెప్పిన ఒక డైలాగ్ కే మీరందరూ మురిసిపోతున్నారు. సినిమాలో అలాంటివి కేజీలు కేజీలున్నాయి అంటూ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నాడు ప్రొడ్యూసర్ గారు. పా రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ కబాలీ మూవీలో రజనీ ఓల్డ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించడం విశేషం. రజనీ సరసన రాధికా ఆప్టే నటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



