రంజాన్ ను టార్గెట్ చేస్తున్న రజనీకాంత్..!
on Jun 16, 2016
రాజనీకాంత్ తాజా చిత్రం "కబాలి" రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయ్యింది. తొలుత జూలై 1న విడుదల చేద్దామనుకొన్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో ఓ వారం పోస్ట్ పోన్ చేద్దామనుకొన్నారు. అయితే.. జూలై 8 కంటే జూలై 15న విడుదల చేస్తే "రంజాన్" పండగ కూడా కలిసివస్తుందన్న సరికొత్త స్ట్రాటజీతో ఇప్పుడు విడుదల తేదీని జూలై 15కి మార్చినట్లు తెలుస్తోంది. ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్ కు హిట్టు-ఫ్లాపులతో సంబంధం లేదని ఇటీవల విడుదలైన "కబాలి" టీజర్ చెప్పకనే చెప్పేసింది. కేవలం భారతదేశంలోని సినిమా అభిమానులే కాకుండా ఇతర దేశాల ప్రజలు కూడా "కబాలి" విడుదల కోసం వెయిట్ చేస్తుండడం విశేషం. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో రాజనీకాంత్ సరసన రాధికా ఆప్టే కథానాయికగా నటిస్తుండగా.. ధన్సిక ఓ ముఖ్యపాత్ర పోషిస్తోంది.