
తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచి మేకర్స్ ని ప్రేక్షకులు కోరుకునేది ఒకటే.. మంచి కంటెంట్ ఇచ్చి హిట్ రేంజ్ తో పాటు కలెక్షన్స్ సంగతి మాకు వదిలేయండి అని. కానీ కొంత మంది ఆ సూత్రాన్ని ఎందుకు పట్టించుకోరో అర్ధం కాదు. ఈ విషయంలో మొదటి ముద్దాయి నిర్మాణ సంస్థనే. దీంతో ప్రముఖ భారీ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. వరుసగా బాక్సాఫీస్ వద్ద ఎదురైన చేదు అనుభవాలు, భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్లుగా మిగిలిన చిత్రాలు ఈ నిర్మాణ సంస్థపై పెద్ద ఎత్తున ప్రశ్నార్థకాలను నిలబెట్టాయి
జననాయగన్, టాక్సిక్, తో పాటు రీసెంట్ గా మొన్న బాలీవుడ్ లో విడుదలైన 'హివాన్' (Hiwaan) వంటి వరస సినిమాలు భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు ఈ సంస్థ మెగా స్టార్ చిరంజీవితో రూపొందిస్తున్న 'కాకా' పై అభిమానులు, ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల చూపు పడింది. మూవీ లవర్స్ అయితే ఏకంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'చిరంజీవితో పాటు దర్శకుడు బాబీ హిట్ మోడ్ లో ఉన్నా 'కాక" లో సరైన కంటెంట్ ఉండాలి? కేవలం ఇమేజ్ ఆధారంగా సీన్స్ ని తెరకెక్కించవద్దు. కథకి సంబంధించిన అన్ని విషయాల్లో పక్కాగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
.webp)
Also Read: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పిఏ డెత్ కేసు: మౌనం వీడిన సూరజ్..నిజంగా హీరోనేనా!
ఏది ఏమైనా మునుపటి పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకుని, బలమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటేనే KVN తన ప్రస్థానాన్ని చాటాలగలదు. ప్రేక్షకులు కేవలం స్టార్‌డమ్‌ను మాత్రమే కాకుండా గ్రిప్పింగ్ స్టోరీ లైన్, బలమైన ఎమోషన్స్ కోరుకుంటున్నారు. కాకాతో KVN సంస్థ భారీ హిట్ అందుకోవాలని కోరుకుందాం.
[Kaaka, Content, Chiranjeevi, Hiwaan review, KVN Productions, Telugu Cinema, Telugu Cinema News, Tollywood Cinema News, Tollywood]





