'రా కింగ్' మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా "డేవిడ్ రెడ్డి" సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.
ఈ రోజు నటి రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ "డేవిడ్ రెడ్డి" సినిమా నుంచి ఆమె బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కమల రెడ్డి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ పోస్టర్ లో ఆమె ఖడ్గంతో శత్రువులను తుదముట్టించి తన ఆసనంపై కూర్చుని ఫెరోషియస్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. రమ్యకృష్ణ కెరీర్ లో కమల రెడ్డి పాత్ర ఒక ఐకానిక్ క్యారెక్టర్ గా గుర్తుండిపోనుంది.
'రా కింగ్' మంచు మనోజ్, మరియా ర్యబోషప్క, రమ్యకృష్ణ, ఆర్. పార్తీబన్, కాంచన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రవి జక్కుల, కాస్ట్యూమ్స్: హైందవి సుధ, యాక్షన్: సుప్రీమ్ సుందర్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, డీవోపీ: ఆచార్య వేణు, మ్యూజిక్: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొట్టు రవికుమార్, ప్రొడ్యూసర్స్: భరత్ మోటుకూరి, నల్లగంగుల వెంకట్ రెడ్డి, స్క్రిప్ట్, డైరెక్టర్: హనుమరెడ్డి యక్కంటి




.webp)

