Home

»

Latest News

హుషార్ పిట్టలు: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ.!

Sep 15, 2026 1:05PM

రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చి యూత్‌ని ఆలోచింపజేసిన ఒక బోల్డ్ అండ్ ఎమోషనల్ మూవీ 'హుషార్ పిట్టలు'. ఏమాత్రం సౌండ్ లేకుండా, ఉన్నట్లుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది.

అన్షు, వాసవి గణేషన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు బిక్షు ఎంతో రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ సినిమాకి థియేట్రికల్ రన్‌లో మంచి రెస్పాన్సే వచ్చింది. సురేష్‌ ఏషియన్‌ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడంతో అప్పట్లో మంచి టాకే తెచ్చుకుంది. 

టీనేజ్‌లో వచ్చే ఆకర్షణ, అవగాహన లేకపోవడం వల్ల జరిగే పొరపాట్లు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? అనే పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

ఈ కథలో రవి (అన్ష్) అనే కుర్రాడు చదువులో నంబర్ వన్. టెన్త్ క్లాస్‌లో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బ్రైట్ స్టూడెంట్. అదే ఊళ్లో ఉండే చిట్టి (వాసవి గణేషన్) అనే అమ్మాయి రవిని ఎంతో ఇష్టపడుతుంది. కానీ, రవికి ప్రేమ, అట్రాక్షన్ లాంటివేమీ తెలీవు. అతని ప్రపంచం అంతా ఒక్క చదువు మాత్రమే.

కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. రవి చుట్టూ ఉండే బ్యాచ్‌లో బాలన్న అనే ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. బాలన్న మాటలు, అతని ప్రవర్తన రవిని పూర్తిగా ప్రభావితం చేసి తప్పు దారిలోకి తీసుకెళ్తాయి. ఆ ప్రభావాన్ని తట్టుకోలేక, యుక్తవయసులో వచ్చే మార్పుల వల్ల రవి దారి తప్పుతాడు.

చివరకు రవి, చిట్టి ఇద్దరూ హద్దులు దాటి ప్రవర్తించే వరకు వెళ్తారు. శారీరికంగా కలుస్తారు. ఆ విషయం ఇరు కుటుంబాలకూ తెలిసిపోతుంది. ప్రశాంతంగా ఉన్న రెండు ఇళ్లు ఒక్కసారిగా నరకంలోకి నెట్టబడతాయి. తెలిసీ తెలియక చేసిన తప్పు వల్ల ఆ రెండు కుటుంబాలు ఎలా విలవిలలాడాయి? సమాజం నుంచి ఎలాంటి నిందలు ఎదుర్కొన్నారు? అసలు రవి, చిట్టిల జీవితాలు ఏ మలుపు తిరిగాయి? అనేది ఎమోషనల్‌గా ఈ సినిమాలో చూపించారు.

బోల్డ్ గా ఉంటూనే, ఎమోషనల్ గా ఆలోచింపజేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీనేజర్స్ ఎలా దారి తప్పుతున్నారు? తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? వంటి విషయాలను ఇందులో చూపించారు. సైలెంట్ గా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ, ఓటీటీలో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటోంది. 

 

 

 

[Hushar Pittalu Movie, OTT Release, Husharu Pittalu, Telugu Movies 2026, Telugu OTT Movies, Amazon Prime Video, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com