కలెక్షన్లు కుమ్మేసుకుంటున్న జంగిల్ బుక్..!
on Apr 15, 2016

అవడానికి హాలీవుడ్ సినిమాయే ఐనా, జంగిల్ బుక్ తో భారతీయులందరికీ దూరదర్శన్ రోజుల నుంచీ అనుబంధం ఉంది. అందుకే హాలీవుడ్ లో రూపొందిన ఈ సినిమాను ఇండియన్ సినిమాలా భావించి ఆదరిస్తున్నారు. మన దేశ ప్రజాభిమానానికి కేవలం వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా 74 కోట్లు కొల్లగొట్టింది జంగిల్ బుక్ మూవీ. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. చాలా చోట్ల ఇండియన్ సినిమాలు తీసేసి, స్క్రీన్లను జంగిల్ బుక్ కే కేటాయించేస్తున్నారు. అసలు సమ్మర్ సెలవులు. ఆ టైంలో పిల్లల సినిమా వస్తే మినిమం గ్యారంటీ. అలాంటిది ఫ్యామస్ యానిమేషన్ భారీ గ్రాఫిక్స్ తో త్రీడీలో వస్తే, రిజల్ట్ ఎలా ఉంటుందో జంగిల్ బుక్ చూపించింది. రిలీజైన ఫస్ట్ డే నుంచీ అద్భుతమైన టాక్ తో దూసుకుపోతున్న జంగిల్ బుక్, జస్ట్ ఫస్ట్ వీకెంట్ లోనే 40 కోట్లు వరకూ వసూల్ చేసింది. ఆ తర్వాతి నాలుగు రోజుల్లో 34 కోట్లు వసూల్ చేసిందంటున్నారు ట్రేడ్ పండితులు. మొదటి రోజు సులభంగానే టిక్కెట్లు దొరికినా, రోజులు గడిచేకొద్దీ టిక్కెట్లు దొరకని పరిస్థితి కనబడుతోంది. మన దేశంలో వంద కోట్లను ఈజీగా కొల్లగొట్టేస్తుందనేది ట్రేడ్ వర్గాల అంచనా..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



