Home

»

Latest News

మ‌హేష్ సినిమాకి టైటిళ్లే.. టైటిళ్లు

Oct 18, 2016 4:13PM

మహేష్ బాబు, మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రూపుదిద్దుకొంటోంది. ఈసినిమాకి ఇంత వ‌ర‌కూ టైటిల్ నిర్ణ‌యించ‌లేదు. కానీ... సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ సినిమా కోసం రోజుకో టైటిల్ పుట్టుకొస్తోంది. చ‌ట్టంతో పోరాటం, వాస్కోడ‌గామా, ఎనిమి... ఇలా ర‌క‌ర‌కాల టైటిళ్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ అభిమ‌న్యుడు టైటిల్ ఫిక్స‌యిపోయింది అన్నారంతా. ఇప్పుడు ఇంకో టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏజెంట్ శివ‌ అనే పేరుని ఈ సినిమా కోసం క‌న్‌ఫామ్ చేశార‌ని చెప్పుకొంటున్నారు.

కృష్ణ న‌టించిన ఏజెంట్ గోపీ మంచి విజ‌యాన్ని అందుకొంది. అదే సెంట‌మెంట్‌తో మ‌హేష్ సినిమాకి ఈ పేరు పెట్టారంటున్నారు. ఈ సినిమాలో మ‌హేష్ ఇంటిలిజెన్స్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. అందుకే ఇలాంటి పేర్లు బాగా సెట్ట‌వుతాయ‌ని చిత్ర‌బృందం న‌మ్ముతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే వీటిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. దీపావ‌ళికి ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. అప్పుడే టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారట‌. ఈలోగా ఇంకెన్ని కొత్త టైటిళ్లు పుట్టుకొస్తాయో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com