ఆర్ఆర్ఆర్: రామరాజుకు భీమ్ సర్‌ప్రైజ్
on Mar 26, 2020

మార్చి 27 రామ్‌చరణ్ పుట్టినరోజు. సాధారణంగా అయితే ఫ్యాన్స్ పండగలా జరుపుకొనే రోజు. షూటింగ్‌లో ఉంటే సెట్స్‌పై వేడుకలా జరుపుకొనే రోజు. కానీ కరోనా వ్యాప్తి దెబ్బ కారణంగా పుట్టినరోజు వేడుకను జరుపుకొనే పరిస్థితులు చరణ్‌కు కానీ, అతని ఫ్యాన్స్‌కు కానీ లేవు. తన పుట్టినరోజు వేడుకలు జరుపవద్దనీ, ఆ కారణంగా నలుగురూ ఒకచోట గుమికూడవద్దనీ ఇప్పటికే తన అభిమానులను చరణ్ కోరాడు. అయితే ఆరోజు చరణ్‌కు అతని మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. అవును. ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు తారక్.
'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్)లో రామరాజుగా చరణ్, కొమరం భీమ్‌గా తారక్ నటిస్తున్న విషయం తెలిసిందే. రామరాజు కోసం భీమ్ (భీమ్ ఫర్ రామరాజు) పేరుతో శుక్రవారం చరణ్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు ముందుగా ఫీలర్ వదిలాడు తారక్.
"బ్రదర్ రామ్‌చరణ్, చక్కని వాతావరణంలో నీ పుట్టినరోజు వేడుక జరపాలని అనుకున్నాను. కానీ మనం లాక్‌డౌన్ కింద ఉండటం వల్ల, ఈ సందర్భంలో ఇంట్లోనే ఉండటం ముఖ్యం కాబట్టి, రేపు ఉదయం 10 గంటలకు నీకొక డిజిటల్ సర్‌ప్రైజ్‌ను ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ము, ఇది నువ్వెప్పటికీ మరచిపోలేని ఒక బ్యాంగ్" అని పోస్ట్ చేశాడు తారక్.
సో.. ఇది చరణ్‌కి మాత్రమే కాదు, చరణ్ అభిమానులకు కూడా ఒక బ్యాంగ్ లాగే ఉంటుందని చెప్పవచ్చు. నిజానికి 'ఆర్ఆర్ఆర్' యూనిట్ తరపు నుంచి ఈ సర్‌ప్రైజ్‌ను చరణ్‌కు ఒక ఫ్రెండ్‌గా తారక్ ఈ సర్‌ప్రైజ్ వీడియోను అందివ్వనున్నాడు. ఈ ఫీలర్‌తో ఆ సర్‌ప్రైజ్ వీడియో ఎలా ఉంటుందోననే కుతూహలం అందరిలోనూ వ్యక్తమవుతోంది.


Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



