ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్.. ఒకేసారి రెండు సినిమాలు!
on Oct 23, 2022

'ఆర్ఆర్ఆర్' విడుదలై ఏడు నెలలు అవుతున్నా ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే తారక్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ ప్రారంభించి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో, 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నట్టు ప్రకటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల కొరటాల ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఈ చిత్రం నవంబర్ లేదా డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. అంతేకాదు ఈ చిత్రంతో పాటు తారక్ మరో ప్రాజెక్ట్ ని కూడా పట్టాలెక్కించనున్నాడని ప్రచారం జరుగుతోంది.
'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు తన రెండో సినిమాని తారక్ తోనే చేయాలని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తారక్ సైతం బుచ్చిబాబు చెప్పిన స్టోరీ లైన్ నచ్చి, డెవలప్ చేయమని చెప్పగా.. పూర్తి స్క్రిప్ట్ తో బుచ్చిబాబు మెప్పించాడట. దీంతో బుచ్చిబాబు ప్రాజెక్ట్ కి తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు జనవరి నుంచే ఈ ప్రాజెక్ట్ ని కూడా పట్టాలెక్కించి కొరటాల ప్రాజెక్ట్ తో పాటు షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడట. అదే నిజమైతే తారక్ అభిమానుల ఆనందానికి అవధులుండవు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



