ఎన్టీఆర్ ట్రీట్మెంట్ వికటించిందా...!
on Dec 24, 2017
జనతా గ్యారేజ్ సినిమాలో కాస్త లావుగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్, జై లవ కుశ లో జై క్యారెక్టర్ కోసం ఒళ్ళు పెంచాడు. త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న ఎన్టీఆర్ కి బరువు తగ్గమని సూచించాడట దర్శకుడు. అయితే, అందుకు గానూ, రోజుకి ఒకటి తీసుకోవాల్సింది రెండు ఇంజక్షన్స్ తీసుకున్నాడట. డోస్ ఎక్కువయ్యి ట్రీట్మెంట్ వికటించిందట. తద్వారా మొహం పై ఎఫెక్ట్ పడిందట. ఇది పెద్ద సమస్య కాకపోయినా, సెట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుందట.
ఎన్టీఆర్ ఈ మధ్య ఫ్యామిలీ తో టూర్ వెళ్లాడని వార్తలు వచ్చాయి. కానీ, అందులో ఏ మాత్రం వాస్తవం లేదట. ఇంట్లోనే ఉంటూ కొత్త ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని ఫిలిం నగర్ టాక్. అజ్ఞాతవాసి రిలీజ్, ప్రమోషన్స్ అయ్యే వరకు సమయం ఉంది కాబట్టి ఎన్టీఆర్ కాస్త కుదుట పడ్డాడట. అలా కాకుండా సినిమా వెంటనే తీయాల్సిన పరిస్థితి ఉంటే, ఇబ్బందులు ఎదురయ్యేవట. వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ద్వారా ఫ్యామిలీస్ కి దగ్గరయ్యే పనిలో ఉన్నాడు.