అప్పుడడిగితే ‘నాన్న పార్టీ’ అనేవాడు.. ఇప్పుడేమో..!
on Jul 8, 2017
తారక్ ని చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. అప్పుడే ఎంత పెద్దరికం. తన బిడ్డ అభయ్ అల్లరి గురించీ, ముద్దు ముద్దు మాటల గురించి మీడియాతో చెప్పుకొని తాను మురిసిపోతున్న తీరు చూస్తుంటే... ఆశ్చర్యం అనిపించకమానదు. ఎన్టీయార్ ఓ విధంగా తెలుగు ప్రజల కంటి ముందే పెరిగాడు.
నందమూరి తారక రామారావు మనవడు అయిన కారణంగా తారక్ పసి ప్రాయం నుంచే తెలుగు వారందిరికీ తెలుసు. బాల నటునిగా కెరీర్ మొదలుపెట్టి... ఇప్పుడు తెలుగు నాట సూపర్ స్టార్లలో ఒకనిగా ఎదిగాడు తారక్.తనను ఇప్పటికీ తెలుగునాట చాలామంది ‘మనవడు’అనే పిలుస్తారు. అలాంటి తారక్... తండ్రి అవ్వడం, తన బిద్ద గురించి మీడియాలో మాట్లాడటం చాలామంది ముచ్చటగా ఫీలవుతున్నారు.
తన కుమారుడు అభయ్.. ఊహ తెలిసినప్పట్నుంచీ తన పార్టీనే అనీ, అయితే... అభయ్ ఈ మధ్య స్కూలుకు వెళ్తుండటం, తాను కూడా పొద్దున్నే షూటింగులకు వెళ్లిపోవడం వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనీ, అంతకు ‘ముందు నువ్వు ఎవరి పార్టీ’ అని అడిగితే.. ఠక్కున ‘నాన్న పార్టీ’అనేవాడనీ, కానీ ఇప్పుడు అడిగితే.. ‘అమ్మ పార్టీ’ అంటున్నాడనీ, నాపై ఏం పితూరీలు చెప్పి తన పార్టీలోకి అభయ్ ని తన భార్య లాక్కుందో తెలుసుకోవాలనుకుంటున్నాననీ మీడియా సాక్షిగా మురిసిపోతూ చెప్పాడు తారక్. ఈ విషయం చెబుతున్నప్పుడు తారక్ ముఖంలో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పడం కష్టం. తండ్రి కదా..!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
