కళ్లతో కత్తులు దూస్తున్న ఎన్టీఆర్
on May 19, 2017
.jpg)
జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేస్తాడు..? ఎవరితో చేస్తాడు అంటూ రకరకాల ప్రశ్నలు అభిమానుల బుర్రలను వేడెక్కించాయి. అయితే వారిని ఎక్కువ కష్టపెట్టకుండా యంగ్ టాలెంటెట్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేసేందుకు గానూ షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు డైరెక్టర్ బాబీ..అయితే మూవీలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ఆయన లుక్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది.
వెనుక రావణాసురిడి బ్యాక్ గ్రౌండ్‌లో కారులోంచి బయటకు దిగుతున్న ఎన్టీఆర్ అదిరిపోతున్నాడు. లుక్స్‌తోనే కత్తులు దూస్తున్నట్లుగా ఉంది. ఇంతకు ఆ పోస్టర్ మూడు పాత్రల్లో ఏ పాత్రకు సంబంధించి అనేది అంచనా వేసే పనిలో నందమూరి అభిమానులు బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశి ఖన్నా నటిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



