జూనియర్ ఎన్టీఆర్ ను భయపెడుతోంది ఎవరు?
on Apr 22, 2015

జూ. ఎన్టీఆర్ అంటేనే ఎనర్జీ గుర్తొస్తుంది మనకు. అంత ఎనర్జిటిక్ గా ఉంటాడు సినిమాలో. అలాంటి హీరో ఇప్పుడు 'న' అనే అక్షరానికి తెగ భయపడిపోతున్నాడంట. 'న' అక్షరం ఏంటీ భయపడటం ఏంటీ అనుకుంటున్నారా... చాలాకాలం తరువాత 'టెంపర్' సినిమాతో హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమాతో కూడా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే సినిమాకు 'నాన్నకు ప్రేమతో' అనే పేరునే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే వచ్చిన చిక్కేంటంటే ఇప్పుడు ఆ సినిమా టైటిల్ ఎన్టీఆర్ ను తెగ భయపెడుతోందట. ఎందుకంటే తన కెరీర్ లో వచ్చిన నిన్ను చూడాలని, నా అల్లుడు, నాగ, నరసింహుడు సినిమాలు 'న'అక్షరంతో మొదలైనవే. అవి బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. దీంతో ఈ సినిమాకు కొత్త పేరును మార్చాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడంట. ఈ సినిమా పేరు కనుక మార్చినట్టయితే ఎన్టీఆర్ కూడా 'న' సెంటిమెంటు ఉన్నట్టే అని చెప్పొచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



