హృతిక్ కంటే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎక్కువ..!
on Jul 27, 2025

'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడని.. 30 నిమిషాలుండే కీలక పాత్ర పోషిస్తున్నాడని.. ఇలా మొదట్లో రకరకాల ప్రచారాలు జరిగాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. తమ అభిమాన హీరో తన ప్రైమ్ టైంని వేస్ట్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే 'వార్-2'లో ఎన్టీఆర్ రోల్ గురించి జరిగిన ప్రచారాలన్నీ అబద్ధమని.. టీజర్, ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పాత్రలు సమానంగా ఉండబోతున్నాయని, ఇద్దరు ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలబడబోతున్నారని స్పష్టత వచ్చింది. ఇదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
'వార్-2' టీమ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంది ఎన్టీఆర్ అని తెలుస్తోంది. హృతిక్ కంటే ఎన్టీఆర్ పారితోషికమే ఎక్కువని సమాచారం. ఎన్టీఆర్ రూ.70 కోట్లు తీసుకోగా, హృతిక్ రూ.50 కోట్లు తీసుకున్నాడని అంటున్నారు. అయితే హృతిక్ రెమ్యూనరేషన్ తక్కువ అయినప్పటికీ, ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటాడని బాలీవుడ్ మీడియా చెబుతోంది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'వార్-2' ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వారంలో సాంగ్ విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



