Home

»

Latest News

అందులో అజ‌య్ దేవ్‌గ‌ణ్ చేసిన ఎంట్రీ సీన్ లాంటిది మ‌రే మూవీలోనూ నేను చూడ‌లేదు!

Dec 09, 2021

 

ముంబైలో ఈరోజు జ‌రిగిన 'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌ను ప్ర‌శంస‌ల్లో ముంచెత్తాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. చిన్నపిల్లాడిగా 'ఫూల్ ఔర్ కాంటే'ని చూసిన త‌ను ఆ సినిమాలో దేవ్‌గ‌ణ్ ఎంట్రీ సీన్ చూసి, అలా త‌ను కూడా చేయాల‌ని అనుకునేవాడిన‌ని గుర్తు చేసుకున్నాడు. అలా చెయ్యాల‌ని ఉంద‌ని నేను మా అమ్మ‌తో చెబితే, అలాంటివి సినిమాల్లోనే జ‌రుగుతాయ‌ని ఆమె చెప్పేది అని, 'ఆర్ఆర్ఆర్‌'లో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌తో త‌న వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ షేర్ చేసుకున్న సంద‌ర్భంగా చెప్పాడు తార‌క్‌. ఈ ప్రెస్‌మీట్‌లో య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి, నిర్మాత దాన‌య్య‌, హీరోయిన్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్ పాల్గొన్నారు. Also read:  ఊపిరి బిగ‌ప‌ట్టించే, ఒళ్లు జ‌ల‌ద‌రింప‌జేసే సీన్ల‌తో 'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్‌

"ద‌య‌చేసి అజ‌య్ సార్‌తో న‌న్న‌స‌లు కంపేర్ చేయ‌కండి. మేం పిల్ల‌లం, ఆయ‌న సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయ‌న మా యాక్ష‌న్ సూప‌ర్‌స్టార్‌. ఇప్ప‌టికీ కూడా ఆయ‌న అలాగే కొన‌సాగుతున్నాడు. 'ఫూల్ ఔర్ కాంటే' చూశాను, అందులోని ఎంట్రీ సీన్ జ‌స్ట్ టెర్రిఫిక్‌. అలా చేయాల‌నుకుంటున్నాన‌ని మా అమ్మ‌తో అంటే, అలాంటివి సినిమాల్లోనే జ‌రుగుతాయ‌ని త‌ను చెప్పింది. నేనెన్నో తెలుగు మూవీస్ చూశాను కానీ, 'ఫూల్ ఔర్ కాంటే'లో అజ‌య్ సార్ చేసిన ఎంట్రీ సీన్ లాంటిది నేనింత‌దాకా చూడ‌లేదు. అజ‌య్ సార్‌తో ప‌నిచేయ‌డం అనేది ఒక గురువుతో ప‌నిచేయ‌డం లాంటిది. ఆయ‌న‌తో స్క్రీన్ షేర్ చేసుకొనే చాన్స్ నాకు ల‌భించ‌లేదు కానీ, స్క్రీన్‌పై అలాంటి జెంటిల్‌మ‌న్‌ను చూస్తున్న‌ప్పుడు చాలా ఆనందంగా అనిపించింది"  అని చెప్పాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. Also read:  'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. 'పులి'ని పట్టుకోవాలంటే 'వేటగాడు' కావాలి!

'ఆర్ఆర్ఆర్' ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, ఆ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్ చేసిన ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకున్నాడు. "కొన్ని క్యారెక్ట‌ర్స్ స్పెష‌ల్‌గా ఉంటాయి. గ‌తంలో 'భ‌గ‌త్ సింగ్‌'లో అలాంటి క్యారెక్ట‌ర్ చేశాను. 90 ఏళ్ల పైబ‌డిన ఆయ‌న సోద‌రుడి నుంచి చాలా క‌థ‌లు విన్నాను. అవి వ్య‌క్తిగా న‌న్ను మార్చాయి." అని చెప్పాడు అజ‌య్‌. రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com