‘సలార్’ పార్ట్1 లో ఎన్టీఆర్!
on Oct 4, 2023
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్. డిసెంబర్ 22న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు సరైన మాస్ హిట్ పడలేదు. బాక్సాఫీస్ దగ్గర మరోసారి ప్రభాస్ రేంజ్ తెలియాలంటే సలార్ మూవీ రావాల్సిందేనని ఆయన అభిమానులు అంటున్నారు. మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ హీరోగా ఉంటేనే ఈ రేంజ్ అంచనాలుంటే ఆయనతో పాటు మరో ఇద్దరు హీరోలు నటిస్తే ..ఎలా ఉంటుంది.. ఎక్స్‌పెక్టేష్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకీ సలార్ మూవీలో ప్రభాస్‌తో పాటు నటించబోయే మరో ఇద్దరు స్టార్ హీరోలెవరు? వారే ఎందుకు నటించాల్సి వచ్చిందనే వివరాల్లోకి వెళితే,
ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన సలార్ మూవీ ఎప్పుడో రావాల్సింది. కానీ కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదాలు పడింది. చివరకు డిసెంబర్ 22న వచ్చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించేశారు. ఒక వైపు వెయ్యి కోట్ల రేంజ్ ఉన్న ప్రభాస్ ఓ వైపు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరో వైపు ఉండటంతో సలార్‌పై అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. దీనికి తోడు మరో ఇద్దరు స్టార్స్ ఈ మూవీలో కనిపించబోతున్నారని అంటున్నాయి సినీ సర్కిల్స్. ఆ ఇద్దరు స్టార్స్ ఎవరో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాక్ స్టార్ యష్. అయితే వీరిద్దరూ సలార్ చివరలో మాత్రమే కనిపిస్తారని సమాచారం.
ఎన్టీఆర్, యష్ కలిసి సలార్‌లో కనిపిస్తారనే వార్తలు పుట్టటానికి కారణం..సలార్ మూవీలో ప్రశాంత్ నీల్ ఇంతకు ముందు యష్‌తో చేసిన కెజియఫ్ 2 ఎండింగ్‌కి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయబోతున్న సినిమాకు లింకు ఉంటుందని టాక్. అందువల్ల వారిద్దరినీ సలార్‌లో చూపించబోతున్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అదే కనుక నిజమైతే మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవుతుందనటంలో సందేహం లేదు. అయితే ఈ ముగ్గురు హీరోలను, కథలను ప్రశాంత్ నీల్ తన యూనివర్సల్‌లోకి తీసుకొచ్చి ఎలా లింక్ చేస్తారనే కూడా ఆసక్తికరంగా మారింది.
సలార్ మూవీ పార్ట్ 1 మాత్రమే ఇప్పుడు రానుంది. మరి పార్ట్ 2ని ప్రశాంత్ నీల్ ఎప్పుడు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. హోంబలే ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా మెప్పించబోతున్నారు. త్వరలోనే సలార్ ట్రైలర్‌ను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
