Home

»

Latest News

ఇదేం టైటిల్‌.. మ‌హేష్ ఫ్యాన్స్ ఫీలౌతున్నారు

Dec 12, 2016 1:09PM


మ‌హేష్ బాబు - మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది. అయితే టైటిల్ విష‌యంలో చిత్ర‌బృందం ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ క్లారిటీ రాలేదు. బ‌య‌ట ర‌క‌ర‌కాల పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. జ‌న‌వ‌రి 1న మ‌హేష్ సినిమా ఫ‌స్ట్ లుక్ ని, అదే స‌మ‌యంలో టైటిల్‌నీ రివీల్ చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఈ సినిమా కోసం ఏజెంట్ శివ అనే పేరు బ‌లంగా వినిపించింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఇదే పేరు పెడ‌తార‌ని, మ‌హేష్‌కీ ఈ టైటిల్ బాగా న‌చ్చింద‌ని చెప్పుకొన్నారు. అయితే అనూహ్యంగా సంభవామి అనే టైటిల్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. మురుగ‌దాస్ ఈ టైటిల్ ప‌ట్ల ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ని, ఆల్మోస్ట్ ఇదే ఫిక్స‌వ్వొచ్చ‌ని చెప్పుకొంటున్నారు. అయితే ఈ టైటిల్‌పై చిత్ర‌బృందం అభిమానుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవ‌డం మొద‌లెట్టింది. కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఈ టైటిల్ ప‌ట్ల పెద‌వి విరుస్తున్నార‌ని స‌మాచారం. ``మ‌హేష్‌సినిమా అంటే టైటిల్ ప‌వ‌ర్‌ఫుల్ గా ఉండాలి... సాఫ్ట్ టైటిల్ అచ్చురాలేదు..`` అని ఫ్యాన్స్ చెబుతున్నార‌ట‌. ఏజెంట్ శివ టైటిల్ అయితేనే బాగుంటుంద‌న్న నిర్ణ‌యాన్ని వెలుబుచ్చుతున్నార్ట‌.  బ్ర‌హ్మోత్స‌వం లాంటి సాప్ట్ టైటిల్స్ మ‌హేష్‌కి స‌రిప‌డ‌వ‌ని.. మూడ‌క్ష‌రాల టైటిల్ అయితే బెట‌ర్ అని ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వెల్ల‌డిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ ఫీడ్ బ్యాక్  అంతా ప‌రిశీలించి.. అప్పుడు ఫైన‌ల్‌గా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఏదేమైనా మ‌హేష్ టైటిల్ ఏమిట‌న్న సంగ‌తి తేలాలంటే జ‌న‌వ‌రి 1 వ‌ర‌కూ ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com