ఎన్టీఆర్ విశ్వరూపంపై కళ్యాణ్‌రామ్ ఫైర్...!
on Dec 28, 2016
.jpg)
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ మొత్తం మూడు పాత్రలలో కనిపించనున్నాడట. ఈ పాత్రలు దేనికదే డిఫరేంట్‌గా వుంటాయట. అందుకే ఈ చిత్రానికి ‘విశ్వరూపం’అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ టైటిల్ గురించి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ.... మేము అసలు ఎటువంటి టైటిల్‌ను పెట్టలేదంటూ తేల్చేశాడు. ఎన్టీఆర్‌తో నేను తీయబోతున్న సినిమా గురించి ఏ వార్తనైనా అఫీషియల్‌గానే నేను ప్రకటిస్తాను. మీడియాలోగానీ... సోషల్ మీడియాలో గాని ఎవైనా వార్తలు వస్తే మీరు నమ్మకండి అంటూ కళ్యాణ్‌రామ్ వివరించారు... ఇక ఈ చిత్రం సంక్రాంతి తర్వాతనే సెట్స్‌పైకి వెళుతుందని కూడా వివరించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్, నివేదా థామస్, అనుపమలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



